1,300 years old Hindu temple discovered in northwest Pakistan: పెషావర్‌: పాకిస్థాన్‌ (Pakistan) లో 1300 ఏళ్ల నాటి అతి పురాతన హిందూ దేవాలయం (Hindu temple ) బయల్పడింది. పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలోని స్వాత్ జిల్లా బారీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని కనుగొన్నారు. కొంతకాలం నుంచి ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌, ఇటాలీయన్‌ పురావస్తు శాఖ తవ్వకాలను చేపట్టింది. ఈ క్రమంలో గురువారం 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం వెలుగు చూసినట్లు పాక్‌ పురావస్తు శాఖ చీఫ్‌ ఫజల్‌ ఖాలిక్‌ తెలిపారు. అయితే ఇది దాదాపు  1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించిన శ్రీ మహావిష్ణువు ఆలయంగా పాక్ పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ తవ్వకాల్లో ఆలయ సమీపంలో కొలను, వాచ్‌టవర్‌‌తోపాటు పలు ఆనవాళ్లను కూడా కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. Also raed: Chhath Puja: అత్యంత వైభవంగా ఛత్ పూజ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హిందూ షాహీలు లేదా కాబుల్‌ షాహీలు క్రీ.శ.850-1026 ప్రాంతంలో కాబుల్‌ లోయ, గాంధార (తూర్పు ఆఫ్ఘానిస్తాన్-ఆధునిక పాకిస్తాన్) ను పాలించిన హిందూ రాజ వంశం. అప్పటికాలంలో తూర్పు ఆఫ్ఘానిస్థాన్‌, గాంధార, వాయువ్య భారతదేశాన్ని కాబుల్‌ లోయగా పిలిచేవారు. కావున ఈ ఆలయాన్ని హిందూషాహి రాజ్యంలో నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.  Also raed: Uttar Pradesh: కల్తీ మద్యం తాగి నలుగురు మృతి 


Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి