CM Jagan Tour: దావోస్‌లో ఏపీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండోరోజు సీఎం జగన్ పాల్గొన్నారు. ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్ సెషన్‌లో సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కరోనా సమయంలో తీసుకున్న చర్యలను వివరించారు. వైద్య వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం గురించి తెలియజేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పరిస్థితులను బట్టి కరోనా నియంత్రణను కార్యాచరణ రూపొందించామన్నారు. 44 ఇళ్లను ఒక యూనిట్‌గా తీసుకుని ఇంటింటి సర్వే చేశామని వెల్లడించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ సేవలందరించారని చెప్పారు. వీరితోపాటు 42 వేల మంది ఆశావర్కర్లు పనిచేశారన్నారు. ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలను గుర్తించి..వారికి తగు జాగ్రత్తలు తీసుకునేలా చూశారన్నారు సీఎం జగన్. ప్రత్యేకంగా ఐసోలేషన్‌ సెంటర్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కరోనా మరణాల రేటులో రాష్ట్రం దేశంలోనే అత్యల్పంగా నమోదు అయ్యిందని గుర్తు చేశారు. 


ఫ్యామిలీ డాక్టర్ తరహాలో వైద్యులను తీసుకురాబోతున్నామని డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్ సెషన్‌లో వెల్లడించారు సీఎం జగన్. ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కేర్ సిస్టమ్‌ను సిద్ధం చేశామన్నారు. ప్రతి రెండు వేల జనాభా కలిగిన ఊరులో విలేజ్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి 13 వేల జనాభాను మండల యూనిట్‌గా తీసుకుని..ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రుల్లో ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చెప్పారు. పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయని తెలిపారు. 


పీహెచ్‌సీలో ఉన్న డాక్టర్‌ బాధ్యతగా కొన్ని గ్రామాలకు వెళ్లి వైద్యం చేస్తారన్నారు. వీరంతా గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లలుగా సేవలందిస్తున్నారని సీఎం జగన్ తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రతి పార్లమెంట్‌ను యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ కళాశాలలు రాబోతున్నాయని తెలిపారు. వీరంతా హెల్త్ కేర్‌ భాగమవుతారన్నారు సీఎం. రాబోయే మూడేళ్లలో వైద్య రంగానికి మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. మొత్తం 2 వేల 446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్స అందుతుందని చెప్పారు.


 


Also read:Major Movie: 'మేజర్' కొత్త ప్రయోగం.. భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి!


Also read:Vizag Bride Srujana: పెళ్లి ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది.. విశాఖ నవ వధువు కేసులో వీడిన మిస్టరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook