Major Movie: 'మేజర్' కొత్త ప్రయోగం.. భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి!

Adivi Sesh's Major Movie Exclusive Previews Across India. మేజర్‌ సినిమా విడుదల తేదికి సమయం దగ్గరపడుతుండడంతో ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఓ కొత్త ప్రయోగం చేసేందుకు సిద్దమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 01:17 PM IST
  • 'మేజర్' కొత్త ప్రయోగం
  • భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి
  • జూన్‌ 3న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్
Major Movie: 'మేజర్' కొత్త ప్రయోగం.. భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి!

Adivi Sesh starrer Major Movie gets Exclusive Previews Across India: శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో యువ హీరో అడివి శేష్‌ తాజాగా నటించిన చిత్రం 'మేజర్‌'. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్, జీఎంబీ బ్యానర్‌ల మీద ఈ సినిమా రూపొందింది. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా.. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన మేజర్‌ సినిమా జూన్‌ 3న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

మేజర్‌ సినిమా విడుదల తేదికి సమయం దగ్గరపడుతుండడంతో ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఓ కొత్త ప్రయోగం చేసేందుకు సిద్దమైంది. హాలీవుడ్ సినిమాల మాదిరి రిలీజ్ చేయడానికి ముందు 'ప్రివ్యూ' షోస్ వేయనుంది. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ ప్రివ్యూ షోస్ పడనున్నాయి. మే 24 నుంచి ఈ షోస్ ప్రారంభం కానున్నాయి. సినిమా విడుదలకి పది రోజుల ముందు ఇలా ప్రివ్యూస్ వేయడం భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. 

దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, పూణె, కొచ్చి నగరాల్లో మేజర్‌ సినిమా ప్రివ్యూస్ ప్రదర్శిస్తారు. ఇందుకోసం మేకర్స్ 'బుక్ మై షో'తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేజర్‌ సినిమా ప్రివ్యూ చూడాలనుకునే వారు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి. సైబర్ కేటుగాళ్ళ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sesh Adivi (@adivisesh)

మే 9న విడుదల అయిన ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంది.మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బాల్యం, ఉద్యోగం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటలు ట్రైలర్‌లో కళ్లకు కట్టాయి. శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన మేజర్‌ సినిమాకి శ్రీచరణ్ పాకాలా సంగీతం అందించాడు. ఈ చిత్రంలో శోభితా ధూలిపాళ ఓ కీలక పాత్ర పోషించారు. జూన్ 3న ఈ  సినిమా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. 

Also Read: Mayank Agarwal Injury: క్రీజ్‌లోనే కుప్పకూలిన మయాంక్ అగర్వాల్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

Also Read: Kane Williamson: రెండోసారి తండ్రైన కేన్ విలియమ్సన్.. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News