Azerbaijan: అర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య కాల్పుల విరమణ.. వెల్లడించిన రష్యా
అర్మేనియా ( Armenia ), అజర్‌బైజాన్ ( Azerbaijan ) దేశాల మధ్య పర్వత ప్రాంతాల భూ వివాదం 1988లో ప్రారంభం అయింది.
అర్మేనియా ( Armenia ), అజర్‌బైజాన్ ( Azerbaijan ) దేశాల మధ్య పర్వత ప్రాంతాల భూ వివాదం 1988లో ప్రారంభం అయింది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రమైన అశాంతి నెలకొంది. రాజకీయ అనిశ్చితికి అది దారి తీసింది. ఈ హింసకు చెరమగీతం పాడటానికి పలు దేశాలు రంగంలోకి దిగాయి. 1994లో కాల్పుల విరమణ ( Cease Fire ) ఒప్పందం వరకు కూడా వెళ్లింది వ్యవహారం. కానీ ఇరు దేశాల మధ్య సరిహద్దు వద్ద ఘర్షణ వాతావరణం సాధారణం అయింది.
ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే! ఇలా చెక్ చేయండి
ఇటీవలే ఈ రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే సుమారు పది రోజుల పాటు సాగిన చిన్న పాటి యుద్ధం తరువాత ఇరు దేశాలు అక్టోబర్ 10వ తేదీన కాల్పులు విరమించడానికి చర్చలు జరిగాయి. నాగోర్నో-కరాబక్ వివాదాస్పద ప్రాంతంపై ఈ చర్చలు జరిగినట్టు రష్యా ( Russia ) విదేశాంగ మంత్రి సర్జీ లావ్రో సమాచారం అందించారు. శనివారం ఉదయం నుంచి సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ చర్చలకు మాస్కో వేదికగా నిలిచింది.
మాస్కోలోని అల్ జజీరా కరాస్పాండెంట్ తెలిపిన వివరాల ప్రకారం కాల్పుల విరమణను మానవతా కోణంలో ఆలోచించిన తీసుకున్నట్టు తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం వెంటనే అమలులోకి వస్తుందో లేదో అనేది చూడాల్సి ఉంటుంది అని తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి సంధి జరపడానికి రెడ్ క్రాస్ సొసైటీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR