Russian cancer vaccine: క్యాన్సర్ రోగులకు శుభవార్త. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా చెప్పిన వార్త నిజమైతే అది యావత్ ప్రపంచానికి ఉపశమనం అందించే వార్త అవుతుంది. రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 ప్రారంభం నుండి ఫ్రీగా అందించే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు ఇంకా వెల్లడించలేదు. రష్యా తన స్వంత mRNA వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అభివృద్ధి చేసింది.
Syria Civil War: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. దీని వెనక అమెరికాలోని డీప్ స్టేట్ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ దేశాల్లో తమ మాట వినని ప్రభుత్వాలు క్రమంగా కూలుస్తూ వస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో సిరియాలో అసద్ ను పదవీచ్యుతుడిని చేయడంలో అమెరికా తెర వెనక పావులు కదిపిందనే వార్తలు వస్తున్నాయి.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ యుద్దానికి ముగింపు పలుకుతానని శపథం చేసాడు. కానీ ఆయన పదవి చేపట్టేలోపే.. జో బైడెన్ ప్రభుత్వం.. ఉక్రెయిన్ ను రష్యాను రెచ్చగొట్టేలా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా పై మిస్సైల్స్ దాడులు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదును చూసి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
Romance Ministry In Russia: రష్యాలోని త్వరలోనే కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పడబోతోంది. ఈ దేశంలో జనాభా రేటు తగ్గడంతో పాటు సంతానోత్పత్తి రేటు కూడా విపరీతంగా పడిపోవడంతో రష్యా శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అంతర్జాతీయ నేతలు సామాజిక్ మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ మాట్లాడారు.
Prime Minister Naredra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చని తర్వాత రష్యా సహా పలు దేశాలను సందర్శించారు. తాజాగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా బయలు దేరి వెళ్లారు.
Russia news: రష్యా దేశఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉద్యోగం చేస్తున్న కూడా గ్యాప్ దొరికితే.. శృంగారంలో పాల్గొనాలని కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రజల్ని కోరారు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Planes Hit By GPS Jamming Across Europe: ఆకాశంలో జీపీఎస్ వ్యవస్థ స్తంభించింది.. దారి చూపే జీపీఎస్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర కలకలం రేగింది.
Russia Ukraine War Update: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా బలగాలు మద్దతుగా నిలిస్తే.. అణు యుద్ధానికి సిద్దమవుతామని ప్రకటించారు. రష్యాలో ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.
Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
Luna 25 Crashed Into Moon: రష్యాకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోమస్ ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. రష్యా ప్రయోగించిన లూనా 25 ఉపగ్రహం చంద్రుడిపై కూలిపోయింది. ఈ మేరకు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Russia: దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి 'లునా-25' పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది రష్యా. ఈ రాకెట్ శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
Russia and Ukraine అంతర్జాతీయ స్థాయి సమావేశం అయిన బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ లో జండా విషయంలో రష్యా మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Gaganyaan Yatra: గగన్‌యాన్ యాత్రపై స్పష్టత వచ్చింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్షయాత్రకు ఈ ఏడాదే బీజం పడనుంది. మే నెలలో తొలి మిషన్ ప్రారంభం కానుందని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Russian Scientist Andrey Botikov Murder: ప్రముఖ శాస్త్రవేత్త, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆండ్రీ బోటికోవ్‌ను ఓ వ్యక్తి హత్య చేశాడు. బెల్టుతో గొంతు బిగించి.. దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.