Train Crash In Greece: గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న  ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందగా.. మరో 85 మంది గాయపడ్డారు. ఏథెన్స్ నుండి థెస్సలోనికీకి (Thessaloniki) వెళ్తున్న ప్యాసింజర్ రైలు...థెస్సలోనికి నుండి లారిస్సాకు ప్రయాణిస్తున్న కార్గో ట్రైన్ సెంట్రల్ గ్రీస్‌లోని టెంపే పట్టణానికి సమీపంలో  ఢీకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఏథెన్స్ కు 380 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో రైళ్లు పట్టాలు తప్పాయి. మంటలు తీవ్రంగా ఎగసిపడ్డాయి. చట్టు ప్రక్కల ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసిందని అధికారులు వెల్లడించారు. దాదాపు  250 మంది ప్రయాణికులను బస్సుల్లో థెస్సలోనికి సురక్షితంగా తరలించినట్లు థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్స్టాంటినోస్ అగోరాస్టోస్ తెలిపారు. ఘటన సమయంలో ప్యాసింజర్ రైలులో 350 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్ ఆపరేటర్ హెలెనిక్ ట్రైన్ తెలిపారు.రెస్క్యూ వర్కర్లు క్యారేజీల్లో టార్చ్‌లు మోసుకుని చిక్కుకున్న ప్రయాణికుల కోసం వెతుకుతున్నారు.


సమీపంలోని లారిస్సా నగరంలో కనీసం 25 మందికి తీవ్ర గాయాలైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంటల్లో కాలిపోయిన బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. డజన్ల కొద్దీ అంబులెన్సులు సహాయక చర్యలో పాల్గొన్నాయని ఆయన చెప్పారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులు రైలు బండి కిటికీల నుంచి కింద పడ్డారని ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు. ప్యాసింజర్ రైలు అదుపుతప్పి పట్టాల పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. హెడ్ ​​ల్యాంప్‌లు ధరించిన సిబ్బంది దట్టమైన పొగలో చిక్కుకున్న వ్యక్తులను వెతికారు. 


Also Read: Turkey Syria Earthquake: తుర్కియే, సిరియాల్లో 50 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook