Turkey Syria Earthquake: తుర్కియే, సిరియాల్లో 50 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

Turkey Earthquake: తుర్కియే, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 50వేలు దాటింది. బాధితులను ఆదుకునేందుకు ఏడాదిలోగా వేగంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని తుర్కియే అధ్యక్షుడు ప్రకటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 08:26 AM IST
Turkey Syria Earthquake: తుర్కియే, సిరియాల్లో 50 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

Turkey Earthquake Death Count: ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంప మృతుల సంఖ్య 50,000 దాటింది. 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తుర్కియే ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం రాత్రికి 44,218కి పెరిగిందని ఆ దేశ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) తెలిపింది. సిరియాలో ఈ విలయానికి బలైన వారి సంఖ్య 5,914గా ఉంది. దీంతో రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50వేలు దాటింది. తుర్కియేలో బాధితులను ఆదుకునేందుకు ఏడాదిలోగా ఇళ్లను నిర్మిస్తామని ఆదేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. అయినప్పటికీ అధికారులు  ఇళ్ల నిర్మాణంలో వేగం కంటే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

టర్కీలోని 11 భూకంప ప్రభావిత ప్రావిన్సులలో వాలంటీర్లతో సహా దాదాపు 240,000 మంది రెస్క్యూ వర్కర్లు పని చేస్తూనే ఉన్నారు. మెుదట్లో కొన్ని ప్రాంతాల్లో యాక్సెస్ చేయడమే కష్టంగా ఉండేది. తాజాగా పరిస్థితి కొలిక్కి వచ్చింది. పునరుద్ధరణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ విపత్తు కారణంగా తుర్కియేలో దాదాపు 5 లక్షల 30వేల మంది ఇళ్లు చేశారు. దేశంలో లక్షా 73వేల భవనాలు కూలిపోయినట్లు లేదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 1.9 మిలియన్లకు పైగా ప్రజలు తాత్కాలిక ఆశ్రయాలు లేదా హోటళ్ళు మరియు ప్రజా సౌకర్యాలలో ఆశ్రయం పొందారు. ఈ ప్రకృతి విలయానికి టర్కీలో దాదాపు 20 మిలియన్ల మంది, సిరియాలో 8.8 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

Also Read: Pakistan: టర్కీకి సాయం చేసిన పాక్.. బాక్సులు ఓపెన్ చేస్తే ఊహించని గిఫ్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News