కరోనా వైరస్ లక్షణాలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను సోమవారం మధ్యాహ్నం ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కరోనా లక్షణాలు ముదరడంతో ఏ క్షణంలోనైనా కోవిడ్19 పాజిటివ్‌గా తేలే అవకాశాలున్నాయని వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 5న కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని బోరిస్ జాన్సన్ లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కరోనాను జయించిన 10 నెలల బుడ్డోడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా లక్షణాలు ముదురుతున్నట్లు వైద్యులు గుర్తించారని, వారి సలహా మేరకు ఆయనను ఐసీయూకు తరలించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారంటూ మెడికల్ స్టాఫ్‌కు కితాబిచ్చారు. మరోవైపు ఆయన గైర్హాజరీలో విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ తన బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహిస్తారని ప్రకటించారు.  ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


అంతకుముందు సోమవారం ఉదయం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బోరిస్ జాన్సన్ తన కేబినెట్ మంత్రులకు సందేశాన్ని పంపించారు. కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగించాలని, చర్యలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని మంత్రి వర్గానికి సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తున్న కారణంగా ఆస్పత్రిలో చేరానని, కలిసికట్టుగా కరోనాను ఎదర్కొందామని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు


కాగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనారోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. బోరిస్ జాన్సన్‌ను ఐసీయూకు తరలించారని విన్నాను, ఇది చాలా విచారకరం. ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా ప్రజలు ప్రార్థించాలని పిలుపునిచ్చారు. తనకు మంచి స్నేహితుడని, ఏ విషయాన్ని తేలికగా వదిపెట్టే రకం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos