కరోనాను జయించిన 10 నెలల బుడ్డోడు

10 నెలల బుజ్జాయి కరోనా వైరస్ నుంచి కోలుకుని కోవిడ్ నెగటివ్‌గా రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Last Updated : Apr 7, 2020, 09:24 AM IST
కరోనాను జయించిన 10 నెలల బుడ్డోడు

కరోనా మహమ్మారిపై పోరాటంలో చాలా తేలికగా విజయం సాధించవచ్చునని మరోసారి తేలింది. ఇటీవల కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు కరోనా బారి నుంచి బయటపడ్డ విజయం తెలిసిందే. తాజాగా తమిళనాడులో ఐదుగురు పేషెంట్లకు చికిత్స అనంతరం టెస్టులు చేయగా కోవిడ్ నెగటివ్‌గా తేలింది. ఇందులో 10 నెలల బాబు ఉండటం విశేషం. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

సాధారణంగా వృద్ధులు, చిన్నారులకు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, వీరి ప్రాణాలకు త్వరగా ముప్పు వస్తుందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో 10 నెలల బుజ్జాయి కోవిడ్ పాజిటివ్ నుంచి కోలుకుని కోవిడ్ నెగటివ్‌గా రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ బాబుకు తల్లి(29) నుంచి కరోనా సోకినట్లు తేలింది. ఆమె రైల్వేలో డాక్టర్. పేషెంట్ ద్వారా ఆమెకు కరోనా సోకగా తమిళనాడులో 43వ కరోనా బాధితురాలయ్యారు. ఆ డాక్టర్ నుంచి తన పిల్లాడికి, ఇంట్లో ఓ పెద్దావిడకు, పని మనిషికి కూడా కోవిడ్ వ్యాపించింది. మార్చి 29న కోవిడ్ పాజిటీవ్‌గా తేలగా కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

కొన్ని శాంపిల్స్ ఫలితాలు సోమవారం రాగా, అందులో ఈ 10 నెలల బాబుకు, తల్లికి, ఇంట్లోని పెద్దావిడ, పని మనిషితో పాటు మరో 25 ఏళ్ల విద్యార్ధికి సైతం నెగటివ్‌గా తేలడంతో వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. అయితే 4 వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు, అధికారులు ఆదేశించారు. కాగా, దేశంలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి కావడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

Trending News