Canada Issue: కెనడాలో బ్రాంప్టన్ లో ఖలిస్థానీ వేర్పాటు వాదులపై కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఖలిస్థాని జెండాతో కెనడా పీల్ ‌ప్రాంత రీజనల్‌ పోలీసు అధికారి హరీందర్ సోహీపై ఆందోళన చేపట్టారు. ఖలిస్థానికి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీందర్‌ సోహీ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో కెనడా పోలీస్‌ శాఖ సోహీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్  స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. మొత్తంగా గత కొన్నేళ్లుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణ దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఖలీస్థానీ వేర్పాటు వాదులకు సాక్షాత్తు అక్కడ ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కెనడాలో ఖలీస్థానీ వేర్పాటు వాది నిజ్జర్ హత్య చేయించింది భారత ప్రభుత్వ గూఢచారి విభాగం ‘రా’ అని నిరాధారా ఆరోపణలు చేసింది.


ఏది ఏమైనా కెనడా ప్రధాని.. భారత రాయబారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించి తన పరిధి దాటారు. ఒక దేశ రాయబారి అధికారిపై ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య యత్న ఆరోపణలు చేసి బరి తెగించారు. దీనికి ఎలాంటి భారత్ కూడా ధీటైనా సమాధానమే చెప్పింది. ఏది ఏమైనా కెనడా ప్రధానిపై ఆ పార్టీ ఎంపీలే తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదంతం ఎంత వరకు వెళుతుందో  చూడాలి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.