కరోనావైరస్ (Coronavirus) సోకిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1,30,000 చేరుకుంది. చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో తొలిసారి బయటపడిన కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు వ్యాపించింది. 4,900 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య 3,100 గా ఉంది. ప్రపంచం నలుమూలల పలువురు ప్రముఖులు సైతం కరోనా వైరస్ సోకిన బాధితుల జాబితాలో ఉన్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ భార్య సోఫీ గ్రెగోయిర్ సైతం కరోనావైరస్ సోకడంతోనే మృతిచెందారనే వార్త ఇవాళ్టి న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే, అదృష్టవశాత్తుగా భార్య సోఫీకి కరోనావైరస్ సోకినప్పటికీ... కెనడా అధ్యక్షుడు జస్టిన్ మాత్రం కరోనా వైరస్ లక్షణాలు లేకుండా సురక్షితంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన ప్రముఖుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : IPL Matches in Delhi: ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం!


అర్సెనల్ మేనేజర్ మైకెల్ అర్టెటాతో పాటు ఇంగ్లండ్ జాతీయ ఫుట్ బాల్ జట్టు ఆటగాడు కల్లం హుడ్సన్-ఒడొయికి కరోనావైరస్ పాజిటివ్ అని గుర్తించారు. కొంతమంది ఫుట్ బాల్ ఆటగాళ్లకు కరోనావైరస్ సోకిన కారణంగా ఈసారి ప్రీమియర్ లీగ్ మ్యాచులన్నీ ప్రేక్షకులు లేకుండానే ముగించనున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.


స్పెయిన్ మంత్రి ఇరెనె మొంటెరోకు కూడా కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు. కేబినెట్‌లో ఒక మంత్రికి కరోనావైరస్ సోకిందని తెలుసుకున్న స్పెయిన్ ప్రభుత్వం... ఆ దేశ రాజ కుటుంబీకులతో పాటు కేబినెట్‌లో ఉన్న మంత్రులు అందిరికీ కోవిడ్-19 టెస్టులు చేయించారు. 


ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో అతడిని వన్డే సిరీస్‌కి దూరం పెట్టారు. భరించలేని గొంతు నొప్పితో బాధపడుతున్న రిచర్డ్సన్‌ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించగా ఈ విషయం తేలింది. 


ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హాంక్స్, అతడి భార్య రిటా విల్సన్ ఇద్దరికీ కరోనావైరస్ సోకింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆ ఇద్దరికీ.. అక్కడే వైరస్ సోకినట్టు తెలుస్తోంది.


ఇరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇజాక్ జహంగిరి, అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రి అలీ అస్ఘర్, ఇరాన్ పరిశ్రమలు, గనులు, వాణిజ్య శాఖ మంత్రి మౌనెశన్ రెజా రెహ్మాన్ సైతం కరోనావైరస్ చికిత్స పొందిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..