ఇప్పుడైతే ప్రపంచం అరచేతిలోకొచ్చేసింది. సుదీర్ఘ సందేశాలు..సుదూర తీరాల్నించి రెప్పపాటు కాలంలో ముందుంటున్నాయి. మరి ఒకప్పుడు ఎలా ఉండేది. పావురాల ( Pigeons )పై ఆధారపడేవారు. అటువంటి ఓ సందేశమే ఇప్పుడు బయటపడింది. అదేంటో చూద్దామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సాంకేతికత ( Technology ) పెరిగే కొద్దీ సమాచారం కనుమూసి తెరిచేంతలో మనముందు ప్రత్యక్షమవుతోంది. సమాచారం ( Information or message ) చేరేవేసేందుకు పక్కనుంటే ఎంతసేపు పడుతుందో..వేళ మైళ్ల ఆవల ఉన్నా అంతే సమయం పడుతోంది. ఇదే సాంకేతిక విప్లవం ప్రభావం. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సైన్స్ పురోగతి ( Science ). రెప్పపాటు కాలంలో సుదూర తీరాల్నించి సుదీర్ఘ సందేశాల్ని అందించగలుగుతున్నాం. 


మరి గతంలో అంటే టెక్నాలజీ అభివృద్ధి కాకమందు పరిస్థితి ఎలా ఉండేది. ఓ ముఖ్యమైన సమాచారాన్ని వెంటనే అందించాలంటే ఏం చేసేవారు. ఎలా అందించేవారు. ఇప్పుడైతే కూర్చున్న ప్రాంతం నుంచే ప్రపంచంలోని ఏ మూలకైనా సమాచారం పంపించగలుగుతున్నాం సెకన్ల వ్యవధిలో. మెయిల్, వాట్సప్ ( Whatsapp ), ఫేస్ బుక్ ( Facebook ) , ట్విట్టర్ ( Twitter ) ఇలా చాలా వేదికలున్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపు వందేళ్ల క్రితం ఎలా ఉండేది. ఇప్పటి తరం వారికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు గానీ..పావురాల ఆధారంగా అప్పట్లో సమాచారం పంపించేవారు. అప్పట్లో రాజులు పావురాల్ని వేగులుగా కూడా ఉపయోగించుకునేవారు. వందల మైళ్ల అవతలకు సమాచారం అందించడానికి పావురాల్ని వినియోగించేవారు. 


అందించాల్సిన సమాచారాన్ని అత్యంత చిన్నగా చుట్టి..పావురం మెడలో వేసి లేదా కాలికి కట్టి ఎగరేసేవారు. ఆ పావురం వందల మైళ్లు ప్రయాణించి డెస్టినేషన్ పాయింట్ కు చేరుకునేది. తిరిగి అక్కడందించే సమాచారాన్ని ఇటువైపుకు చేేరవేసేది.  దాదాపు వందేళ్ల క్రితం అంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ పావురాయి సందేశం  తాజాగా వెలుగులోకి వచ్చింది.  తూర్పు ప్రాన్స్ కు చెందిన ఓ జంట వాకింగ్‌ కోసం బయటకు వెళ్లినప్పుడు...వారికి ఓ చిన్న క్యాప్సుల్ లాంటిది కన్పించింది. చూడ్డానికి వింతగా ఉండటంతో తెరిచి చూశారు. ఆ చిన్న క్యాప్సుల్ లో మడత పెట్టిన చిన్న లేఖ ఉంది. దాదాపుగా వందేళ్ల క్రితం ( Century old pigeon message ) ప్రష్యా దేశపు సైనికుడు పావురం ద్వారా పంపించిన సందేశం ఇది.   అయితే దురదృష్టవశాత్తూ గమ్యస్థానాన్ని చేరుకోలేదు ఆ సందేశం. 


తూర్పు ఫ్రాన్స్‌ ( France ) లోని ఓర్బీలో ఉన్న లింగే మ్యూజియం క్యూరేటర్ డొమినిక్ జార్డి చెప్పిన దాని ప్రకారం ఈ సందేశం  మొదటి ప్రపంచ యుద్ధకాలం ( First world war period ) ( 1914-10 ) నాటిది.  ఇంగర్‌షీమ్‌లోని ఒక సైనికుడు తన ఉన్నతాధికారిని ఉద్దేశిస్తూ జర్మన్‌ భాషలో స్వయంగా  చేతితో రాసిన ఉత్తరమిది. ఈ లేఖలో కీలకమైన సైనిక విషయాల్ని వివరించాడు.  ప్రస్తుతం తూర్పు ఫ్రాన్స్‌లో భాగమైన ఇంగర్‌షీమ్‌‌ ఒకప్పుడు జర్మనీలో భాగంగా ఉండేది. ఈ  ఉత్తరం ఈ ఏడాది సెప్టెంబర్‌లో లభించింది. మ్యూజియం క్యూరేటర్ జార్జికు ఈ సందేశాన్ని అందించగా.. మరొకరి సహాయంతో ఈ మెసేజ్‌ని డీకోడ్‌ చేశారు.అపూర్వమైందిగా భావించి..మ్యూజియంలో ప్రదర్శనార్ధం ఉంచారు. Also read: America president: జో బిడెన్ పూర్వీకులు భారతీయులే..ఎలాగో తెలుసా