China cancels Indian flights over coronavirus outbreak: న్యూఢిల్లీ: భారత్‌ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China ) రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్‌కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో ( India to China flights) ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. అంతేకాకుండా భారత్‌లోని విదేశీయులు చైనాలోకి ప్రవేశంపై కూడా తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. చైనా వీసా, రెసిడెన్స్‌ పర్మిట్‌ ఉన్నప్పటికీ వారిని తాత్కాలికంగా తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టంచేసింది. ఒకవేళ వీసాలు మంజూరు అయి ఉన్నప్పటికీ భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికారులు వారి ఆరోగ్య ప్రతాలపై స్టాంప్‌ వేయరని స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అత్యవసరాలకు చైనా సందర్శించాలనుకునే విదేశీయులు మాత్రం భారత్‌లోని చైనా రాయబార కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నవంబరు 3 తర్వాత జారీ చేసిన వీసాలతో చైనాలోకి ప్రవేశింపజేయరని పేర్కొంది. అయితే భారత్‌లో కరోనా పరిస్థితులను పరిశీలించిన అనంతరం మరలా నిర్ణయం తీసుకుంటామని చైనా వెల్లడించింది. Also read: Vijay: ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: తలపతి విజయ్


ఈ నిర్ణయం నేపథ్యంలో వందే భారత్‌ మిషన్‌ కింద నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమాన సర్వీసులను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేస్తున్నట్లు భారత్ పేర్కొంది. అయితే చైనా నుంచి భారత్‌కు వచ్చే అత్యవసర ప్రయాణికుల కోసం చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా నేపథ్యంలో చాలా దేశాలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించాయి. ఇదిలాఉంటే.. అక్టోబరు 30న ఢిల్లీ నుంచి వుహాన్ వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 


 Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe