China Mind Game: సరిహద్దులో పంజాబీ పాటలెందుకు విన్పిస్తున్నాయో తెలుసా
నేరుగా యుద్ధం చేసే కంటే మానసికంగా చేసే యుద్ధంలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనేది అనాది నుంచి వస్తున్నదే. ఇప్పుడు చైనా అదే విధానాన్ని అవలంభిస్తోంది. సరిహద్దు వద్ద మైండ్ గేమ్ ఆడుతోంది.
నేరుగా యుద్ధం చేసే కంటే మానసికంగా చేసే యుద్ధంలో ( psychological war ) విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనేది అనాది నుంచి వస్తున్నదే. ఇప్పుడు చైనా అదే విధానాన్ని అవలంభిస్తోంది. సరిహద్దు వద్ద మైండ్ గేమ్ ఆడుతోంది.
భారీగా లౌడ్ స్పీకర్లు. ఆ స్పీకర్ల నుంచి అదే పనిగా భారతీయ పంజాబీ పాటలు ( Punjabi songs ) విన్పిస్తున్నాయి. ఏదో వేడుకలో అనుకుంటున్నారా..కానే కాదు. ఇది ఇండో చైనా బోర్డర్ ( indo china border ) వద్ద..చైనా దేశం చేస్తున్న ఏర్పాట్లు. అదేంటనుకుంటున్నారా..అదే జరుగుతోంది. చైనా ఇప్పుడు కొత్తగా మైండ్ గేమ్ ( china new mind game ) ఆడుతోంది. భారతీయ సైనికుల ఏకాగ్రతను చెడగొట్టేందుకు, దృష్టి మరల్చేందుకు లౌడ్ స్పీకర్లు పెట్టి హై వాల్యూమ్ తో పంజాబీ పాటలు ప్లే చేస్తోంది. ఈ మధ్యనే వార్నింగ్ షాట్ ఫైరింగ్ ( Warning shot firing ) చేసిన చైనా సైనికులు ఈసారి మైండ్ గేమ్ రూట్ ను పాటిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతం, ఫింగర్-4, మోల్డో గ్యారిసన్, ఛుసుల్ సెక్టార్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను అమర్చి పంజాబీ పాటల్ని విన్పిస్తున్నాయి చైనా బలగాలు.
వాస్తవానికి చైనాకు ఈ పద్ధతి అలవాటే. 1990 నుంచే ఈ పద్ధతి అవలంభిస్తున్నారు. చైనా సైనికుల ఈ చర్యను ఆర్ట్ ఆఫ్ వార్ ( Art of war ) గా పిలుస్తారు. శతృవును మానసికంగా దెబ్బకొట్టడానికి, అశాంతికి గురి చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ను ప్రయోగిస్తారని చైనా మిలట్రీ వ్యూహకర్త ఒకరు రాసిన ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకంలో సైతం ఉంది. ఇలాంటి సైకలాజికల్ వార్ కు దిగడం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ( China peoples liberation army ) కు కొత్తేమీ కాదన్నది నిపుణుల వాదన. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శతృవును రెచ్చగొట్టేందుకు ఇలా చేస్తుందని అంటున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో వార్నింగ్ షాట్ ఫైరింగ్ చేసిన తరువాత...1-2 వ్యూహాత్మక ప్రాంతాల్ని భౌగోళికంగా భారత సైనికులు స్వాధీనం చేసుకోవడంతో చైనా బలగాలు షాక్ తిన్నాయి. అందుకే ఇప్పుడిలా లౌడ్ స్పీకర్లతో రెచ్చగొట్టే పనికి దిగారు. ప్యాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని రె జంగ్ లా-రెసిన్ లా రిడ్జ్‌లైన్ ప్రాంతాల్లో భారత జవాన్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనితో చైనా తన వ్యూహాన్ని మార్చిందని, యుద్ధ చేయకుండా ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారిపై పైచేయి సాధించేలా ఆర్ట్ ఆఫ్ వార్ ట్రిక్స్‌ను ( Art of war tricks ) ప్రయోగిస్తోందని అంటున్నారు.
నేరుగా యుద్ధానికి దిగకుండానే శత్రువును మానసికంగా దెబ్బతీయడమనే పద్ధతిని గతంలోనే అంటే 1962 ( 1962 war ) లోనే భారత్ పై చైనా ప్రయోగించింది. ఇప్పుడు మరోసారి అదే పద్ధతిని అవలంభిస్తోంది. పూర్తిగా కమ్యూనిజం భావజాలంతో రెచ్చగొట్టే విధానాన్ని అనుసరిస్తోంది. నెగెటివ్ ఇంపాక్ట్ కలిగే పంజాబీ పాటల్ని విన్పించడం ద్వారా సరిహద్దు వద్ద ఉన్న భారతీయ సైనికుల ఏకాగ్రతను దెబ్బకొట్టడమే చైనా లక్ష్యంగా ఉంది. Also read: US Elections: ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందా లేదా?