గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా మారింది. కరోనా వైరస్ ( Corona virus ) నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో వ్యాధి విస్తరిస్తోంది. బ్రూ సెల్లోసిస్ ( Brucellosis ) అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చైనా నుంచి ప్రారంభమైంది. ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చైనా ( China ) లోని వుహాన్ నగరం ( Wuhan city ) నుంచి విస్తరించి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇంకా అదుపులో రాలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ ( Corona second wave ), థర్డ్ వేవ్ అంటూ భయపెడుతోంది. ఈ క్రమంలో మరో ప్రాణాంతక వ్యాధి అదే చైనా నుంచి విస్తరిస్తోంది. చైనా గన్స్ ప్రావిన్స్ రాజధాని లాన్ జౌ ( Lanzhou ) లో ఈ వ్యాధి వెలుగుచూసింది. బ్రూ సెల్లోసిస్ అనే ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ( Bacterial infection ) ఇప్పటికే 6 వేలమందిలో పాజిటివ్‌గా నిర్ధారణైనట్టు ప్రభుత్వ వర్గాలే ధృవీకరించాయి. నగరంలో 55 వేల 725 మందికి పరీక్షలు చేయగా..6 వేల 620 మందికి పాజిటివ్ అని తేలిందని  వైద్యులు తెలిపారు. పశువులపై ఉండే బ్రూసెల్లా ( Brucella bacteria ) అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని తేలింది. సెప్టెంబర్ 14 నాటికి ఈ కేసుల సంఖ్య 3 వేల 245 ఉండగా..ఇప్పుడీ సంఖ్య 6 వేలు దాటింది. 


Also read: 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట


బ్రూ సెల్లోసిస్ వ్యాధి లక్షణాలు


జంతువులతో ప్రత్యక్ష సంబంధం ఉంటే ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, త్రాగటం ద్వారా లేదా గాలిలో ఉండే ఏజెంట్లను పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించనుంది. ఫ్లూలో కన్పించే లక్షణాలే ఈ వ్యాధిలో కూడా కన్పిస్తాయి. కొందమందిలో ఈ  లక్షణాలు దీర్ఘకాలికంగా మారి.. ఇక ఎప్పటికీ తగ్గకపోవచ్చనేది వైద్యులు చెబుతున్నమాట.


చైనాలోని  యానిమల్ హస్బండ్రీ ఇండస్ట్రీ కో యాజమాన్యంలోని బయో ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి ఇది వెలుగు చూసిందని తెలిసింది.  ఈ కంపెనీ గత ఏడాది జూలై- ఆగస్టు మధ్యలో  బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ తయారీ కోసం ఎక్స్‌పైర్ అయిన క్రిమిసంహారక మందులను ఉపయోగించింది. ఆ తరువాత బ్యాక్టిరియాను కలుషితమైన వ్యర్థ వాయువులో వదిలివేయడంతో అందులో ఏరోసోల్స్‌ ఏర్పడ్డాయి. అనంతరం గాలి ద్వారా లాన్‌జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. 


మరోవైపు వందేభారత్ మిషన్ ( Vande Bharat mission Flights ) లో భాగంగా తాజాగా భారత్‌ నుంచి చైనాకు వెళ్లిన ఎయిరిండియా విమానంలో 19 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్ సహా ఇతరదేశాల్నించి వచ్చే విమానాల్ని చైనా నిషేధించింది. ఎప్పటివరకూ ఈ నిషేధమన్నది చైనా ఇంకా ప్రకటించలేదు. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా