కరోనా వైరస్ ( Corona virus ) మరో అదనపు లక్షణంలో కలవరం కల్గిస్తోంది. కరోనా వైరస్ సోకినవారికి కూడా మళ్లీ వ్యాధి తిరగబెడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలే కరోనా వైరస్ సంకేతాలుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ మొట్టమొదటి సారిగా వెలుగుచూసిన చైనా ( China ) లో ఇప్పుడు మరో కలకలం రేగుతోంది. కరోనా వైరస్ గురించి కొత్త లక్షణాలు ( New Symptoms ) బయటపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గతంలో కరోనా సోకిన వారికే మళ్లీ వ్యాధి రావడం కలకలం కల్గిస్తోంది. సెంట్రల్ చైనా ప్రావిన్స్ హుబీలో ( Central China province ) 68 ఏళ్ల మహిళకు వ్యాది ప్రారంభమైన కొత్తలో అంటే గత ఏడాది డిసెంబర్ లో కరోనా సోకింది. ఇప్పుడు మళ్లీ అంటే ఆరేడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి కరోనా నిర్ధారణైంది. అదే విధంగా విదేశాల్నించి వచ్చిన ఓ వ్యక్తికి ఏప్రిల్ నెలలో కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు మళ్లీ వారం రోజుల క్రితం కరోనా సోకినట్టు తేలింది. అయితే ఈ వ్యక్తికి లక్షణాలు మాత్రం లేవని తెలిసింది. 


కరోనా వైరస్ సోకి కోలుకున్న తరువాత  వ్యాధి మరోసారి తిరగబెట్టడం నిజంగానే ఆందోళన కల్గిస్తోంది. దీన్ని బట్టి కరోనా వైరస్ లో దీర్ఘకాలిక లక్షణాలున్న వ్యాధిగా ( Chronic disease ) భావించవచ్చనే వాదన ప్రారంభమైంది. ఒకసారి వ్యాధి సోకితే మళ్లీ రావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. Also read: WHO: రష్యా వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు


వాస్తవానికి వైరస్ అనేది ఓసారి సోకి..బయటపడినప్పుడు ఆ వ్యక్తిలో యాంటీబాడీలు  ( Anti bodies ) తయారై..తిరిగి ఆ వ్యాధి ఎటాక్ చేయకుండా ప్రతిరోధకాలుగా పనిచేస్తాయి. కానీ కోవిడ్ వైరస్ విషయంలో అలా నూటికి నూరు శాతం జరగడం లేదు. ఇలా రెండోసారి వైరస్ బారిన పడటానికి కారణం సదరు వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) లేకపోవడమ లేదా వైరస్ బలోపేతం కావడమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడీ దిశగా పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ కరోనా వైరస్ అనేది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుందా అనేే ఆందోళన కూడా కలుగుతోంది. Also read: COVID-19 vaccine: భారత్ చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాలపై భూటాన్ ఆసక్తి