కరోనా వైరస్ ( Coronavirus ) ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే.. బ్రిటన్ లో ఇప్పుడు కరోనా రెండవ దశ ( Corona second wave ) ప్రతాపం చూపిస్తోంది. రోజుకు లక్ష కొత్త కేసులు నమోదవుతూ..ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ సంక్రమణ ప్రారంభమైనప్పుడు ముందుగా ప్రభావితమైన యూరప్ దేశాల్లో( Europe )  బ్రిటన్ ( Britain ) తీవ్రంగా ప్రభావితమైంది. దీన్నించి కోలుకోకుండానే ఇప్పుడు కరోనా వైరస్ రెండోదశ విజృంభిస్తోంది. ప్రస్తుతం రోజుకు లక్ష కొత్త కేసులు నమోదవుతుండగా.. ప్రతి తొమ్మిది రోజులకు ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కన్పిస్తోంది. అంటే రానున్న రోజుల్లో రోజుకు రెండు లక్షల  కొత్త కేసులు నమోదు కావచ్చని హెచ్చరికలున్నాయి. ఇక రెండవ దశలో కరోనా వైరస్‌ బారిన పడి కనీసం 85 వేలమంది మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండవ దశ కరోనాను కట్టడి చేయాలంటే..మొదటి దశలో కంటే పగడ్బంధీగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి ఉందని ఇప్పటికే కరోనా వైరస్ విజృంభణపై ప్రభుత్వం నియమించిన కమిటీ హెచ్చరించింది.


ఇప్పటికే యూరప్ దేశాలైన ఇటలీ ( Italy ) , స్పెయిన్ ( Spain ) లలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్డౌన్, ఎమర్జెన్సీని ప్రకటించి..స్థానిక ప్రజల్నించి వ్యతిరేకత కొనితెచ్చుకున్నాయి. పెద్దఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన సేజ్ కమిటీలో లండన్ ( London ) ‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులున్నారు. ఈ కమిటీ అక్టోబర్‌ 16 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా మహమ్మారి రెండవ దశ ప్రారంభమైనట్టు తేలింది. మరోసారి లాక్‌డౌన్‌ లేదా కఠిన ఆంక్షలు విధించాలనే ఒత్తిడి దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై పెరిగింది. 


మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి మతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని, రోజుకు కనీసం 8 వందలమంది మరణించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఇంగ్లండ్ లో 40 వేలమంది మరణించారు. రెండవ దశలో దాదాపు 85 వేల మంది మరణించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా. దేశంలో 86 వేల శాంపిల్స్ పరిశీలించడం ద్వారా వైరస్‌ రెండవ దశ కొనసాగుతున్నట్లు పరిశోధకులు నిర్ధారణకొచ్చారు.


లాక్డౌన్ , ఎమర్జెన్సీ విధింపు నేపధ్యంలో ఇటలీ , స్పెయిన్ దేశాల్లో పెల్లుబికిన నిరసన, కొనసాగుతున్న హింసాత్మక ఘటనల నేపధ్యంలో బ్రిటన్ ప్రభుత్వం రెండోసారి కఠిన లాక్డౌన్ ( lockdown ) పై ఆలోచన చేస్తోంది. Also read: Europe: లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు