Europe: లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు

అక్కడి ప్రజలకు కరోనా వైరస్ కట్టడి కంటే లాక్‌డౌన్‌ విధించకపోవడమే మంచిదన్పిస్తోంది. అందుకే వేలాదిగా రోడ్డెక్కి..లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. హింసాత్మక సంఘటనలకు కూడా పాల్పడ్డారు.

Last Updated : Oct 29, 2020, 09:23 PM IST
Europe: లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు

అక్కడి ప్రజలకు కరోనా వైరస్ ( Corona virus )  కట్టడి కంటే లాక్‌డౌన్‌ విధించకపోవడమే మంచిదన్పిస్తోంది. అందుకే వేలాదిగా రోడ్డెక్కి..లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. హింసాత్మక సంఘటనలకు కూడా పాల్పడ్డారు.

కరోనా వైరస్ విజృంభణను అరికట్టేందుకు యూరప్ దేశాల్లో ( Europe countries ) రెండో విడత లాక్‌డౌన్ ( 2nd phase lockdown )‌ విధించారు. అయితే ఇక్కడి ప్రజలకు ఇదేమాత్రం ఇష్టం లేదు. స్వేచ్ఛగా తిరగడానికే మొగ్గు చూపిస్తున్నారు. అందుకే వేలాదిగా లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు ( Anti lockdown protests ) చేస్తున్నారు. ఇటలీ ( Italy ) లో వరుసగా మూడోరోజు కూడా  రాత్రివేళల్లో నిరసనకారులు ఆందోళన  కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్ సోకినా ఫరవాలేదు గానీ..సాకర్ మాత్రం మిస్సవకూడదనుకున్నారు. అందుకే సాకర్‌ అభిమాన అల్లరి మూకలు, మితవాద తీవ్రవాదులు అందరూ కలిసి ఈ ఆందోళనలో దిగారు. స్వయంగా ప్రభుత్వ వర్గాలే ఈ విషయాన్ని ప్రకటించాయి.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల్ని కట్టడి చేసేందుకు ఇటలీ ప్రధాన మంత్రి గిసెప్పే కాంటే బుధవారం నుంచి రోమ్, నాప్‌లెస్, మిలాన్‌ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు దేశంలో లాక్డౌన్ ఆంక్షలు ( Lockdown restrictions ) విధించారు. ఇందులో భాగంగా క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్‌ ఫూల్స్‌ను మూసివేశారు. ఈ నిర్ణయానికి నిరసనగా రెస్టారెంట్ల యజమానులు, టాక్సీ డ్రైవర్లు పగటి వేళల్లో శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తుండగా, సాకర్‌ అభిమాన అల్లరి మూకలు మాత్రం రాత్రి వేళల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరి మూకలు దుకాణాల లూటీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటలీలో ఇప్పటివరకూ ఆరు లక్షల వరకూ కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, 38 వేల మంది మరణించారు. మరోవైపు స్పెయిన్ ( Spain ) ‌లో కూడా రెండో విడత లాక్‌డౌన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 15 రోజులపాటు తాత్కాలికంగా ఎమర్జెన్సీ ( Emergency in spain ) పరిస్థితిని ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీని ఆరు నెలలపాటు పొడగించాల్సిందిగా దేశ పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్నారు. స్పెయిన్‌లో ఇప్పటివరకూ పది లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడగా, దాదాపు 35 వేల మంది మరణించారు. ఈ ఎమర్జెన్సీకి స్పెయిన్ లో కూడా  నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.

యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) ప్రారంభమైనట్టు ఇప్పటికే ధృవీకరణైంది. ఈ నేపధ్యంలో యూరప్ దేశాల్లోని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ఆర్ధికంగా నష్టపోయినవారు నిరసనకు దిగుతున్నారు.  Also read: TIME: టైటిల్ మార్చుకున్న టైమ్..చరిత్రలో తొలిసారి..ఆఖరిసారి కూడా

Trending News