Covid Vaccine: ఐదేళ్ల లోపు చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. అత్యవసర అనుమతి కోరిన ఫైజర్-బయోఎన్‌టెక్
Covid 19 Vaccine for kids under Five: ఆర్నెళ్ల నుంచి ఐదేళ్ల లోపు పిల్లల కోసం అభివృద్ది చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి కోరుతూ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, బయోఎన్‌టెక్‌లు అమెరికాకు చెందిన `ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్`కు దరఖాస్తు చేసుకున్నాయి.
Covid 19 Vaccine for kids under Five: ఆర్నెళ్ల నుంచి ఐదేళ్ల లోపు పిల్లల కోసం అభివృద్ది చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి కోసం ఫార్మా దిగ్గజాలు ఫైజర్, బయోఎన్‌టెక్‌లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినివ్వాలని తాజాగా అమెరికాకు చెందిన 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్'కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సంబంధిత డేటాను ఆ సంస్థకు సమర్పిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవనున్నట్లు తెలిపాయి.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అడ్వైజరీ కమిటీ ఫిబ్రవరి 15న సమావేశమై ఫైజర్, బయోఎన్‌టెక్‌లు సమర్పించే డేటాను విశ్లేషించనుంది. వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావవంతంగా పనిచేయగలదు.. ఎంతమేర సురక్షితమనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వ్యాక్సిన్‌కు ఎమర్జెన్సీ అనుమతి పూర్తిగా డేటా పైనే ఆధారపడి ఉందని ఫిలడెల్ఫియాలోని వ్యాక్సిన్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ డా.పాల్ పేర్కొన్నారు.
త్వరలోనే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఏజెన్సీలకు క్లినికల్ ట్రయల్ డేటాను సమర్పించనున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ కంపెనీలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతిని కోరుతున్నప్పటికీ.. మున్ముందు కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు మూడో డోసు కూడా అవసరం ఉండొచ్చునని ఫైజర్ సీఈవో అల్బర్ బౌర్లా పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికాలో 2.3 కోట్ల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. ఫైజర్, బయోఎన్‌టెక్ (Pfizer, BioNtech) వ్యాక్సిన్‌కు ఎమర్జెన్సీ అనుమతి లభిస్తే.. తమ చిన్నారులకు వ్యాక్సిన్ (Covid Vaccine) వేయించేందుకు వారంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మూడు నెలల క్రితమే ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఏజ్ గ్రూప్ వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: Chalo Vijayawada: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ.. 'చలో విజయవాడ'కు ప్రభుత్వం అడ్డంకులు!
Also Read: AP Covid-19 Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు...కొత్త కేసులు ఎన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook