Corona Precautionary dose: కరోనా ప్రికాషన్​ డోసుకు రిజిష్ట్రేషన్ అవసరం లేదు.. కానీ..

Corona Precautionary dose: కరోనా ప్రికాషన్​ డోసుకు అపాయింట్​మెంట్స్​ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హులు ఆన్​లైన్​లో లేదా ఆఫ్​లైన్​లో అపాయింట్​మెంట్ బుక్ చేసుకునే వీలుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 12:22 PM IST
  • ప్రికాషన్ డోసుపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల
  • నేటి నుంచే అపాయింట్​మెంట్స్ ప్రారంభం
  • అర్హులకు ఈ నెల 10 నుంచి మూడో డోసు
Corona Precautionary dose: కరోనా ప్రికాషన్​ డోసుకు రిజిష్ట్రేషన్ అవసరం లేదు.. కానీ..

Corona Precautionary dose: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్రం ప్రికాషన్​ డోస్​ (బూస్టర్​ డోస్​) కొవిడ్ టీకా వేసేందుకు అనుమతినిచ్చింది. అర్హులకు నేటి నుంచే ప్రికాషన్ టీకా అపాయింట్​మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఆరోగ్య శాఖ. ఇవాళ సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ (Corona Precautionary dose appointments) ప్రారంభం కానుంది.

అపాయింట్​ మెంట్ తీసుకున్న వారికి సోమవారం (జనవరి 10) నుంచి మూడో డోసు టీకా (Corona Precautionary dose starting date) ఇవ్వనున్నట్లు తెలిపింది.

అపాయింట్​మెంట్ తీసుకుంటే చాలు..

తాజాగా ప్రికాషన్​ డోసుపై మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. ప్రికాషన్ డోసు తీసుకునే వారు మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఇందులో (Corona Booster Dose Guidelines) పేర్కొంది.

వఆన్​లైన్​లో కొవిన్ యాప్, వెబ్​సైట్లో లేదా ఆఫ్​లైన్​లో వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అపాయింట్​మెంట్ బుక్​ చేసుకుంటే సరిపోతుందని (How to Book Corona Precautionary dose appointment) వివరించింది.

గత నెలలో ప్రికాషన్ డోసుకు అనుమతి..

కరోనా ఉదృతి భయాల నేపథ్యంలో గత నెల 25న జాతినుద్దేశించి ప్రధాని మోదీ (PM Modi on Corona Precautionary dose) ప్రసంగించారు. ఇందులో మూడో డోసు టీకాపై ప్రకటన చేశారు. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, ఫ్రంట్​ లైన్​ వర్కర్లకు ముందుగా మూడో డోసును ఇవ్వలని నిర్ణయించినట్లు (Who is eligible for Corona Precautionary dose) తెలిపారు. దేశంలో దీనిని బూస్టర్​ డోసుగా కాకుండా..  ముందు జాగ్రత్త డోసు (ప్రికాషన్​ డోసు)గా పిలవనున్నట్లు తెలిపారు.

ఇక ఇదే సమయంలో 15-18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్​ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారమే.. ఈ నెల 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా ప్రక్రియ ప్రారంభమైంది.

వ్యాక్సినేషన్ రికార్డు..

ఇక దేశంలో కొవిడ్ టీకా తాజాగా సరికొత్త మైలు రాయిని దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 150 కోట్లకుపైగా డోసులు పంపణీ చేసినట్లు ఆరోగ్య విభాగం (Vaccination in India) వెల్లడించింది. అర్హుల్లో (పిల్లలు కాకుండా) 91 శాతం మందికి టీకా ప్రక్రియ ముగిసినట్లు తెలిపింది.

Also read: Corona cases in India: దేశంలో కొవిడ్ కల్లోలం- కొత్తగా 1,41,986 కేసులు నమోదు!

Also read: Omicron Wave: వచ్చే నెలలో భారత్‌లో కరోనా పీక్స్‌కి.. డెల్టా పీక్‌ని మించి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News