ఆ దేశంలో కరోనా వైరస్ జీరోకు చేరుకుంది. అమెరికాకు పక్కనే ఉన్న ఆ దేశం అవలంభించిన విధానాలే ఆ దేశంలో కేసుల సంఖ్య జీరోకు చేరడానికి కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఆ దేశమేంటి?  అవలంభించిన విదానాలేంటి?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా ( America ) తొలిస్థానంలో ఉంది. ఇప్పటికే అమెరికాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంటే...అటు పక్కనే ఉన్న క్యూబా ( Cuba ) దేశంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కరోనా వైరస్ ( Corona virus cases ) కేసులు క్యూబాలో జీరోకు చేరినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. గతంలో న్యూజిలాండ్ దేశం( Newzealand ) కోవిడ్ 19 వైరస్ ఫ్రీ ( Covid 19 virus free country ) దేశంగా ప్రకటితమైంది. అయితే ఆ తరువాత ఆ దేశంలో కూాడా మళ్లీ కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు క్యూబా దేశం ( Cuba as corona free country ) కరోనా ఫ్రీ గా ప్రకటించుకుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వైద్యులుున్న దేశంగా క్యూబాకు పేరుంది. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ విషయాన్ని ప్రపంచం మరోసారి గుర్తించింది. 


కరోనా ఫ్రీగా మారడానికి కారణాలు:


క్యూబాలో కరోనా గైడ్ లైన్స్ పాటించని వారిపై భారీగా జరిమానాలు విధించారు. మాస్క్ లేకుండా బయటకు రావడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. 130 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్ డౌన్ పాటించారు. మరోవైపు దాదాపు ప్రతి ఇంటి నుంచి ఓ డాక్టర్ ఉండటం, గతంలో నేర్చుకున్న అనుభవాల కారణంగా ఆరోగ్యంపై దేశ ప్రజలకు అవగాహన అధికంగా ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ ను నూటికి నూరుశాతం అమలు చేశారు. స్వీయ నియంత్రణను ప్రజలు అలవర్చుకున్నారు. దాంతో క్యూబాలో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు గత కొద్దిరోజులుగా. Also read: Corona virus: అతడికి మళ్లీ పాజిటివ్


ఇప్పటివరకూ దేశంలో కోవిడ్ 19 బారిన పడినవారి సంఖ్య 2 వేల 446గా ఉంది.  వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కూడా తక్కువే ఉంది. అధికశాతం రోగులు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరంతా రోగం నుంచి కోలుకుంటే కరోనా పై పోరులో క్యూబా విజయం సాధించినట్టే. Also read: WHO On Covid-19 Vaccine: 2021 కన్నా ముందు వ్యాక్సిన్ రావడం కష్టం