Trump Security Adviser gets Covid-19: వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనావైరస్ ( Coronavirus ) పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 40 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. దాదాపు లక్షన్నర వరకు వరకు మరణాల సంఖ్య నమోదైంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుడు ( National Security Advisor ) రాబర్ట్ సీ ఓబ్రియన్ ( Robert C. O'Brien) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ( White House) వెల్లడించింది. ఓబ్రియన్‌కు కరోనా సోకడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారని, అక్కడి నుంచే భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వెల్లడించింది. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పని చేస్తుందని వైట్‌హౌస్ వెల్లడించింది. Also read: Covid 19 Vaccine: నవంబర్ కు ఫైజర్ వ్యాక్సిన్ రెడీ


అయితే దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ), ఉపాధ్యక్షుడికి ఎలాంటి ముప్పులేదని వైట్‌హౌస్ స్పష్టంచేసింది. అయితే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో ప్యారిస్‌లో పర్యటించారు. అయితే ఆయన ఈ పర్యటనకు ముందే కరోనా వైరస్ సోకిందా.. ఆ తర్వాత సోకిందా అనేది మాత్రం వెల్లడించలేదు. Also read: WFH: వాళ్లకు మరో ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్