అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్..మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారా. ఇరాన్ పై భారీ దాడికి ప్రయత్నించారా..అదే జరిగితే పెను విధ్వంసం ఉండి ఉండేదా. ప్రపంచ పరిణామాలు మారిపోయుండే మరి ఏం జరిగింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా అధ్యక్ష ఎన్నికల ( America president elections ) పూర్తయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మరో రెండు నెలల పాటు పదవిలో ఉంటారు. ఈ సమయంలో ప్రత్యర్ధి దేశాలతో వివాదానికి ఆజ్యం పోసే నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా  ఇరాన్ పై దాడికి ( Attack on Iran ) ప్రయత్నించినట్టు తెలిసింది. ప్రధానంగా ఇరాన్ లోని ప్రధాన అణుస్థావరంపై దాడి చేసేందుకు ఉన్న మార్గాల్ని సూచించాలని ట్రంప్ అధికారుల్ని కోరినట్టు తెలుస్తోంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, మైక్ పాంపియో, ఢిఫెన్స్ సెక్రటరీ క్రిస్టోఫర్ మిల్లర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 


అయితే డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) నిర్ణయాన్ని అధికారులు అంగీకరించలేదని సమాచారం. ఇరాన్ పై దాడి అనేది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరించడంతో ట్రంప్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్ ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒబామా హయాంలో ఆ దేశంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని 2018లో ట్రంప్ రద్దు చేశారు. వాణిజ్యపరంగా కఠిన ఆంక్షలు విధించారు. బాగ్దాద్ విమానాశ్రయం ( Bagdad airport )లో అమెరికా జరిపిన ద్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీ ( Khasim sulemani ) మరణించారు. ఫలితంగా అమెరికా - ఇరాన్ దేశాల మధ్య వివాదం మరింతగా పెరిగింది. 


డోనాల్ట్ ట్రంప్ ఇరాన్ పై  దాడికి ప్రయత్నించడం వెనుక ఓ కారణం కూడా వెతుక్కున్నారు. ఇటీవల అణు ఒప్పందంలోని నిబంధనల్ని ఇరాన్ అతిక్రమించినట్టు ఐరాస నివేదిక తెలిపింది. అణుశుద్ధిలో ప్రధాన పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్ లను కీలక స్థానంలోకి మార్చే ప్రక్రియను ఇరాన్ పూర్తి చేసింది.  దీన్ని సాకుగా తీసుకుని ఇరాన్ అణుస్థావరంపై దాడికి ప్రయత్నించినట్టు సమచారం. Also read: First Covid-19 Case: ఆ దేశంలో మొదటి కోవిడ్-19 కేసు నమోదు!