Earthquake Today: న్యూ ఇయర్ వేళ జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake Hits Japan: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. షికావా, నీగాటా, టొయామా రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
Earthquake Hits Japan: న్యూ ఇయర్ రోజు జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టారు స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4 నమోదైంది. దీంతో ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ సంస్థ. ఈ రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ ఇషికావా ప్రిఫెక్చర్‌లోని నోటోకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాలలో ఉండాలని కోరింది. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా సిటీ తీరాన్ని ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు నివేదించింది. భూకంప ప్రభావంతో అణు కేంద్రాలపై ప్రభావం ఉంటుందా..? అనేది చెక్ చేస్తున్నట్లు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ తెలిపింది. కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ అణు విద్యుత్ ప్లాంట్‌లలో ఎటువంటి అసాధారణతలు లేవని.. అయితే కంపెనీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.
జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత తూర్పు తీరంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టాలు పెరగవచ్చని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ తెలిపింది. పశ్చిమ జపాన్‌లో భారీ భూకంపాలు సంభవించిన తర్వాత ఇషికావా ప్రిఫెక్చర్‌లో అన్ని హై-స్పీడ్ రైళ్లు నిలిచిపోయాయని స్థానిక మీడియా నివేదించింది. 2011న ఈశాన్య జపాన్‌లో భారీ భూకంపం, సునామీ కారణంగా జపాన్ అల్లకల్లోలమైంది. 9.0 తీవ్రతతో సముద్రగర్భంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సునామీ కారణంగా దాదాపు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారి జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter