ప్రపంచంలో  తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ( First Covid-19 avaccine) ను అందించిన రష్యా ( Russia ) మరో శుభ వార్త తెలిపింది. తము తయారు చేసిన స్పూత్నిక్ వి (Sputnik V ) అనే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన తొలి బ్యాచును రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మురాష్కో బుధవారం ఒక ప్రకటన చేశారు.   స్పూత్నిక్ వి గురించి మాట్లాడిన ఆయన కోవిడ్-19కు ( Covid-19)  తట్టుకునేందుకు ఇమ్యూనిటీ ఉన్న 20 శాతం మంది వైద్యులకు ఈ వ్యాక్సిన్ అవసరం లేదు అని ఆయన అన్నారు. అయితే ప్రయారిటీ విషయాలు వైద్యలలకే వదిలేశాం అన్నారు. 



స్పూత్నిక్ వి వ్యాక్సిన్ తో ముందు రష్యా అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ఎగుమతులు కూడా ( Sputnik V Exports ) ప్రారంభిస్తాం అన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలు తన తొలి ప్రాధాన్యత అన్నారు. ఇటీవలే రష్యా ప్రపంచలోనే తొలి కరోనావైరస్ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా  కోట్లాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.