కరోనావైరస్ ( Coronavirus ) ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అని ఒక అద్యయనంలో తేలింది. జెర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్ కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్-19 ( Covid-19) వైరస్ కారణం అయ్యే సార్స్ కోవ్-2 ( SARS-Cov-2) ను డియాక్టివేట్ చేస్తుందట. వైరల్ లోడ్ ను తగ్గించడానికి మౌత్ వాష్ చేస్తే సరిపోతుందట. ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్న వైరస్ అంతం అవుతుంది అని.. దాంతో వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు.
-
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
-
Quarentine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జర్మనీలో అందుబాటులో ఉన్న ఆ మౌత్ వాష్ ప్రోడక్ట్ లో ( Mouth wash Products ) ఉన్న వివిధ ఇంగ్రీడింట్స్ వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది అంటున్నారు. పరిశోధకులు ల్యాబ్ లో వివిధ వైరస్ లతో మౌత్ వాష్ లను ప్రయోగించగా..ఫలితం కనిపించింది అన్నారు. మౌత్ వాష్ మిక్స్ ను దాదాపు 30 సెకన్ల పాటు షేక్ చేసి తరువాత పుక్కిలించారట.
జర్మనీలో ప్రచురితం అయిన జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ లో ( Journal Of Infectious Diseases ) వెల్లడి అయిన సమాచారం ప్రకారం వైరస్ శాతాన్ని ఈ మౌత్ వాష్ విజయవంతంగా తగ్గించిందట. అది కూడా కేవలం 30 సెకన్ల పాటు మాత్రమే. అయితే దీని ఖచ్చితత్వంపై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాం అని.. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని పరిశోధకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది
- Bhagavad Gita Lessons: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు
- Krishastami Look: మీ చిన్నారిని కృష్ణుడిలా రెడీ చేయాలి అనుకుంటున్నారా ? ఇది చదవండి!
- Krishna Janmastami 2020: శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు
- Who Is Rhea Chakraborty: రియా చక్రవర్తి ఎవరు ?
- Dangerous Film Actress Apsara Rani గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
- Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
- Photos: అందాల రాక్షసి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు