Gold mines accident in Congo : కాంగోలో బంగారం గనులు కూలిన ఘటనలో 50 మంది వరకు కార్మికులు ( Mining labour ) మృతి చెంది ఉంటారని అక్కడి అధికారవర్గాలు భావిస్తున్నాయి. కాంగోలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బంగారం గనుల ప్రవేశమార్గం వద్దకు చేరుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోధనలతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాల ( Heavy rain ) కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. Also read : NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే


ఘటన జరిగిన సమయంలో గనులలో ( Gold mines ) 50 మంది వరకు ఉన్నారని.. వాళ్లంతా అక్కడి నుంచి తప్పించుకునే మార్గం కూడా లేకపోయిందని ఇనిషియేటివ్ ఆఫ్ సపోర్ట్ అండ్ సోషల్ సూపర్‌విజన్ ఆఫ్ ఉమెన్ అధ్యక్షులు ఎమిలియేన్ ఇటోంగ్వా తెలిపారు. Also read : New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాంగోలో మైనింగ్ ప్రమాదాలు సర్వ సాధారణం. ప్రతీ ఏడాది అక్కడి గనులలో డజన్ల కొద్ది కార్మికులు మైనింగ్ ( Mining ) చేస్తుండగా జరిగిన ప్రమాదాల్లో సజీవ సమాధి అయిన ఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉంటాయి. గతేడాది అక్టోబర్‌లో 16 మంది కార్మికులు ఇలాగే ఓ ప్రమాదంలో చనిపోయారు. గతేడాది జూన్‌లో జరిగిన ప్రమాదంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న 43 మంది సజీవ సమాధి అయ్యారు. Also read : Srikalahasti issue: మొన్న అంతర్వేది.. తాజాగా శ్రీకాళహస్తి..


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR