ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా దాదాపు 7300 మరణాలు సంభవించాయి. భయంకరమైన కోవిడ్19 వైరస్.. సినిమా, రాజకీయ, క్రీడా, వ్యాపారం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఇద్దరు హాలీవుడ్ నటులు కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. నటుడు ఇడ్రిస్ ఎల్బా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు క్రిస్టోఫర్ హివుజుకు కరోనా పాజిటీవ్ అని తేలింది. తనకు కరోనా సోకినా ఎలాంటి భయం లేదని, తాను ధైర్యంగా ఉన్నానని చెప్పిన నటుడు ఇడ్రిస్ ఎల్బా కోవిడ్19 పాజిటీవ్ బాధితులలో ధైర్యాన్ని నింపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచానికి గడ్డుకాలం కరోనా: ఎన్టీఆర్, రామ్ చరణ్


తనకు కరోనా సోకిందని చెబుతూ ఆయన పోస్ట్ చేసిన వీడియో 2కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. వేలాదిగా కామెంట్లు, రీట్వీట్లతో ఇడ్రిస్ ఎల్బా కరోనా వైరస్ వీడియో వైరల్ అవుతోంది. ‘కోవిడ్19 పాజిటీవ్ అని తేలింది. నేను మాత్రం మామూలుగానే ఉన్నాను. కరోనాకు సంబంధించి పెద్దగా లక్షణాలేవీ బయటపడలేదు. ధైర్యంగా కరోనాతో పోరాడుతున్నాను. మీకు దీనిపై అప్ డేట్స్ అందజేస్తాను. భయపడాల్సిన అవసరం లేదని’ తన ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చాడు.


నాభి అందాలతో వర్మ హీరోయిన్ రచ్చరచ్చ!



[[{"fid":"183257","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo Courtesy: ANI","field_file_image_title_text[und][0][value]":"నటులు ఇడ్రిస్ ఎల్బా, క్రిస్టోఫర్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo Courtesy: ANI","field_file_image_title_text[und][0][value]":"నటులు ఇడ్రిస్ ఎల్బా, క్రిస్టోఫర్"}},"link_text":false,"attributes":{"alt":"Photo Courtesy: ANI","title":"నటులు ఇడ్రిస్ ఎల్బా, క్రిస్టోఫర్","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


Game of Thrones నటుడికి కోవిడ్ పాజిటీవ్
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు క్రిస్టోఫర్ హివుజు తనకు కరోనా పాజిటీవ్ గా తేలినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘నాతో పాటు నా కుటుంబం ఐసోలేషన్‌లో ఉంది. మేము ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాం. నాకు మాత్రం కాస్త ప్లూ ఉంది. కరోనా సోకిన వారి నుంచి 5 మీటర్ల దూరం ఉండాలి. ఏమైనా అనుమానం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని’ క్రిస్టోఫర్ సూచించారు.


Photos: అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ


కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..