Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయుల్ని ఇబ్పందుల్లో పడేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధుల కోసం ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచమంతా ఇప్పుడు రష్యా--ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారించింది. ఫిబ్రవరి 24వ తేదీ అంటే నిన్న ఉదయమే రష్యా..ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ దేశంలోని ఒక్కొక్క నగరాన్ని టార్గెట్ చేస్తూ రష్యా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది ఇండియా. ఓ విమానం ద్వారా 182 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. మరో విమానం ఢిల్లీ నుంచి ఉక్రెయిన్‌కు బయలుదేరిన కాస్సేపటికే..ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో వెనక్కి వచ్చేసింది. ఫలితంగా చాలామంది భారతీయ విద్యార్ధులు అక్కడ ఇరుక్కుపోయారు. ఇతర దేశస్థులదీ అదే పరిస్థితి. 


ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం రెండు ప్రత్యేక విమానాల్ని పంపించేందుకు సిద్ధమైంది. ఉక్రెయిన్ గగనతలంపై నిషేధముండటంతో సమీప దేశాల్నించి ఈ రెండు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. రుమేనియా దేశం మీదుగా ప్రత్యేక విమానాలు ఇండియాకు రానున్నాయి. ఇవాళ రాత్రి ఉక్రెయిన్ సమీప దేశాల్నించి ఈ విమానాలు భారతీయ విద్యార్ధులతో టేకాఫ్ కానున్నాయి. అక్కడున్న విద్యార్ధుల్ని భారతీయ అధికారులు హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ సరిహద్దులకు తరలిస్తారు. ఈ ప్రణాళికలో భాగంగా ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేలమంది భారతీయ విద్యార్ధులు చిక్కుకుపోయారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల్లో ఎక్కువమంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్నించే కావడం విశేషం. వీరంతా వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ తరలివెళ్లారు. ఇప్పటికే తమ విద్యార్ధుల్ని క్షేమంగా వెనక్కి రప్పించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.


Also read: Russia Ukraine War: కుమార్తెతో విడిపోతూ..వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ తండ్రి, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook