మెరుపు వరదలతో ( Flash Floods ) ఇండోనేషియా ( Indonesia ) అతలాకుతలమైంది. భారీ వర్షాలతో వరద పోటెత్తి పడటంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు  విరిగి పడటంతో భారీగానే ప్రాణనష్టం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్సు ( Indonesia Sulawesi Province ) లో మెరుపు వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద వచ్చి పడటంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండ చరియలు ( Land slides ) విరిగిపడ్డాయి. వరద ఉధృతికి విమానాశ్రయం రన్ వే సహా పలు రహదార్లు దెబ్బతిన్నాయి. ఓ వైపు వరదలు మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు ఇబ్బంది ఏర్పడుతోంది. గ్రామాలకు గ్రామాలు నీటి మునిగిపోయాయి. 4 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. భారీ వరదల కారణంగా 16 మంది ఇప్పటివరకూ చనిపోయారు. 23 మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర లువు ( North Luwu ) లోని ఆరు సబ్ జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దక్షిణ సులవేసి ( South Sulawesi )  ప్రాంతంలోని మసాంబాలో ధ్వంసమైన శిధిలాలు, వరద మట్టిలోంచే రాకపోకలు సాగిస్తున్నారు. Also read: Covid-19 Vaccine: వ్యాక్సిన్ తయారీలో అమెరికా వేగం


వర్షాలు తగ్గితే గానీ సహాయక చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టే అవకాశాలు కన్పించడం లేదు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఇదే ఏడాది జనవరిలో కురిసిన భారీవర్షాల కారణంగా ఇండోనేషియాలో 66 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. Also read: Telangana: హ్యాపీ బర్త్ డే సుజీ