Indonesia Soccer Tragedy: ఇండోనేషియాలోని ఫుట్‌బాల్ మైదానం రణరంగంగా మారింది. స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా మృతుల సంఖ్య 174కు చేరింది. ఈసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు సైతం ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో వంద మందికిపైగా గాయపడ్డారు. వారంతా ఐసీయూలో ఉన్నారు. ఇందులో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రపంచంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఏ క్రీడా మైదానంలో ఇలాంటి దారుణ ఘటన జరగలేదు. ఫుట్ బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ, అరెమా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈమ్యాచ్‌లో అరెమా జట్టు ఓటమి పాలైంది. దీంతో ఇరు జట్ల అభిమానులు గొడవకు దిగారు. 


రంగంలోకి దిగిన పోలీసులు..వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అభిమానులపై లాఠీఛార్జ్‌ చేశారు. ఈనేపథ్యంలో తొక్కిసలాట జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్టేడియంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని..పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తెలియని మరికొందరు అంటున్నారు. చిన్నారులు, మహిళలు అని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 


ఫుట్‌ బాల్ స్టేడియం సామర్థ్యం 42 వేలుగా ఉంది. మ్యాచ్‌ జరగే సమయంలో టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. మ్యాచ్‌ పూర్తి కాగానే దాదాపు 3 వేల మంది మైదానంలోకి దూసుకొచ్చారని..అందుకే టియర్ గ్యాస్ ప్రయోగించామని చెబుతున్నారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు 13 వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో విచారం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. 



Also read:Munugode Bypoll: అక్టోబర్ 7న మునుగోడు బైపోల్ నోటిఫికేషన్? బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి మెసేజ్..


Also read:ICC T20 WC 2022: గెలుపు నీదా..నాదా..భారత్-పాక్ మ్యాచ్‌పై స్పెషల్ ప్రోమో అదుర్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి