Munugode Bypoll: అక్టోబర్ 7న మునుగోడు బైపోల్ నోటిఫికేషన్? బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి మెసేజ్..

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దసరా ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుందని సమాచారం. అక్టోబర్ 7న నోటిఫికేషన్ రాబోతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో ఆ డేటే ఫిక్స్ అంటున్నారు.

Last Updated : Oct 2, 2022, 01:35 PM IST
Munugode Bypoll: అక్టోబర్ 7న మునుగోడు బైపోల్ నోటిఫికేషన్? బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి మెసేజ్..

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికను అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. మునుగోడు ఉపఎన్నికను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్నారు. అందుకే గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకున్నా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కీలక సమాచారం వస్తోంది. బైపోల్ ఎప్పుడు జరగబోతుందన్న దానిపై రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం వచ్చిందని తెలుస్తోంది.

ఆగస్టు 6న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదే రోజున స్పీకర్ ఆమోదించారు. మునుగోడు సీటు ఖాళీగా ఉందంటూ ఎన్నికల సంఘానికి నివేదించింది స్పీకర్ కార్యాలయం. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం చట్ట సభల్లో ఏదైనా ఒక సీటు ఖాళీ అయితే.. ఈ స్థానానికి ఆరు నెలల లోపు ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ లెక్కన మునుగోడు ఉప ఎన్నికను ఫిబ్రవరి తొలి వారంలోగా పూర్తి చేయాలి. దీంతో నవంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ కాని డిసెంబర్ లో జరగాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో కాని మునుగోడు ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా మునుగోడు సెపరేట్ గా బైపోల్ జరిపే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ పెద్దల నుంచి రాష్ట్ర నేతలకు స్పష్టమైన సమాచారం వచ్చిందని సమాచారం.

మునుగోడులో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. దసరా తర్వాత అక్టోబర్ 7న  ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. నవంబర్ లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. దీంతో కోమటిరెడ్డి చెప్పిన అక్టోబర్ 7నే బైపోల్ నోటిఫికేషన్ రావడం పక్కా అని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికపై చర్చించేందుకే కోమటిరెడ్డిని అమిత్ షా డిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. ఆ సమావేశంలో నోటిఫికేషన్ విషయంపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే పని చేస్తుందన్నది నిజం. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తే తమకు లాభిస్తుందనే విషయంలో కమలనాధులు పక్కా ప్రణాళికతో ఉన్నారని సమాచారం. తాజాగా మునుగోడులో సర్వే నిర్వహించిన బీజేపీ పెద్దలకు.. పరిస్థితి అంతా అనుకూలంగా ఉందనే రిపోర్ట్ వచ్చిందట. దీంతో వెంటనే ఉప ఎన్నికకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్. ఈ దిశగా ఎన్నికల సంఘానికి సిగ్నల్ ఇవ్వడంతో.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేందుకు సీఈసీ సిద్దమవుతుందని తెలుస్తోంది.

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసివచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ వస్తుందని చెప్పడంతో ఆ తేదీన రావడం ఖాయమనే చర్చే రాష్ట్రంలో సాగుతోంది. అంతేకాదు శనివారం రాష్ట్ర ముఖ్య నేతలు, మునుగోడు ఎన్నికల కమిటీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలోనే 10 రోజుల్లో బైపోల్ నోటిఫికేషన్ రాబోతుందని బన్సల్ చెప్పారని అంటున్నారు. మొత్తంగా దసరా ముగిసిన వెంటనే మునుగోడు ఉపఎన్నిక నగరా మోగబోతోంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News