Internet 2.0 Report: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో చైనాపై ఉన్న ఆరోపణలకు ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ సైబర్ సెక్యూరిటీ పరిశోధన సంస్థ అందించిన వివరాలు అదే చెబుతున్నాయి. కరోనాకు ముందే ఆ దేశం సన్నద్ధమైందా..ఆ నివేదిక ఏం చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic)ఇప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 2019 నవంబర్-డిసెంబర్ నెలల్లో ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరం నుంచి ప్రారంభమైంది. అలా ప్రపంచమంతా చుట్టేయడమే కాకుండా లక్షలాదిమందిని బలిగొంది. ఇప్పటికీ రూపం మార్చుకుంటూ దాడి చేస్తూనే ఉంది. కరోనా వైరస్ సంక్రమణ విషయంలో అగ్రదేశాలన్నీ చైనాపై ఆరోపణలు సంధించాయి. చైనా ల్యాబ్ నుంచే వైరస్ విస్తరించిందంటూ విమర్శలున్నాయి. ప్రాధమికంగా ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని పలు దేశాలు వాదించాయి. ఇప్పుడు మరో నివేదిక కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది.


ప్రపంచానికి కరోనా మహమ్మారి పరిచయం కావడానికి చాలా నెలల ముందే చైనా ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టిందనేది తాజా సమాచారం. ఇంటర్నెట్ 2.0 (Internet 2.0)అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధన సంస్థ వెలువరించిన నివేదికలో ఇదే ప్రధానమైన అంశం. బలమైన ఆధారాలు బహిర్గతం చేసింది. దేశంలో ఎంతమందికి కరోనా సోకింది, దేశంలో ఎంతవరకూ విస్తరించిందనేది తెలుసుకునేందుకు చైనా పీసీఆర్ టెస్ట్ కిట్లను భారీ సంఖ్యలో ముందుగానే ఆర్డర్ చేసిందని ఇంటర్నెట్ 2.0 సంస్థ వెల్లడించింది. డిజిటల్ ఫోరెన్సిక్, నిఘా ఫలితా విశ్లేషణలో అమెరికా- ఆస్ట్రేలియాకు చెందిన ఈ సంస్థకు విశేష అనుభవముంది. కరోనా అనే కొత్త వైరస్ గురించి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా చెప్పింది 2019 డిసెంబర్ 31న మాత్రమే. అప్పటికి చాలా నెలల ముందే చైనా కోవిడ్ కట్టడికై భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలుపెట్టిందనేది ఇంటర్నెట్ 2.0 సంస్థ వాదన. చైనాలో ఒక్కసారిగా పెరిగి పీసీఆర్ టెస్ట్ కిట్ల(PCR Test Kits)కొనుగోలు పరిమాణాలే దీనికి ఉదాహరణగా ఆ సంస్థ చూపిస్తోంది. వుహాన్ సిటీ(Wuhan City)ఉన్న హుబే ప్రావిన్స్‌లో 2019 ద్వితీయార్ధంలో ఈ కిట్ల కొనుగోలు పెరిగింది. చైనా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని కొనుగోళ్ల వివరాల ఆధారంగానే నివేదిక రూపొందించామని ఇంటర్నెట్ 2.0 సంస్థ చెబుతోంది. 


ఈ వాదనను, ఆరోపణల్ని కొట్టివేసిన చైనా(China)..ఇంత భారీ సంఖ్యలో కొనుగోలు చేసిన కిట్లను దేనికి వినియోగించిందో మాత్రం చెప్పలేదు. మరో నివేదికలో మరిన్ని వివరాలు, కొత్త విషయాలు బయటపెడతామని ఇంటర్నెట్ 2.0 సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థ నివేదిక ఆధారంగా చైనాకు అంతా ముందే తెలుసనే విషయాన్ని ధృవీకరించలేమని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కాకుండా ఇతర వైరస్ సంక్రమిత వ్యాధుల నిర్ధారణకు పీసీఆర్ టెస్ట్ కిట్లను దశాబ్దాలుగా వినియోగించడమే దానికి కారణం.


Also read : Nobel Prize in Physics 2021: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి