Israel Hezbollah War: ఇజ్రాయిల్ దాడులు ఆపడంలో  లెబనాన్ లో శాంతి వాతావరణం నెలకొంది. రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. హెజ్‌బొల్లా ముష్కరులు కొన్నిచోట్ల ఆనందంతో గాల్లో కాల్పులు జరిపారు.ఇజ్రాయెల్‌ జరిపిన దాడులతో లెబనాన్‌లో దాదాపు 12లక్షల మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారిలో అత్యధికులు దక్షిణ లెబనాన్‌ వాసులే ఎక్కువగా ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో వారు తిరిగి తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. అయితే- దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయని.. వాటిని లెక్కచేయకుండా ఆ ప్రాంతాలకు తిరిగిరావొద్దని లెబనాన్‌ వాసులను ఇజ్రాయెల్‌ అరబిక్‌ మిలిటరీ అధికార ప్రతినిధి అవిచయ్‌ అడ్రాయీ తాజాగా హెచ్చరించడం కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా తీర పట్టణమైన టైర్, దాని చుట్టుపక్కల గ్రామాలకు అనేక మంది ప్రజలు తరలివస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంపై సంగతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య 14 నెలల కిందట మొదలైన యుద్ధం ముగియడానికి ఇది కీలక ముందడుగన్నారు. తాజా ఒప్పందం ప్రకారం లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ 60 రోజుల్లో తన బలగాలను ఉపసంహరించుకుంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలోనూ కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం తుర్కియే, ఈజిప్టు, ఖతార్‌ నాయకులతో చర్చలు జరుపుతామని తెలిపారు బైడెన్. లెబనాన్‌ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్‌ గౌరవించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ కోరారు.


కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ స్వాగతించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్‌ స్వాగతించింది. తాజా పరిణామాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తాయని ఆశిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.  


కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు లెబనాన్‌ వ్యాప్తంగా దాడులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 42 మంది చనిపోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ముష్కరులు నిరుడు అక్టోబరు 7న భీకర దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఇజ్రాయెల్‌పై దాడులను హెజ్‌బొల్లా ప్రారంభించింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా ఈ ఏడాది సెప్టెంబరులో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడినప్పటి నుంచి లెబనాన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.


గాజాలో మాత్రం ఇజ్రాయెల్‌ శాంతించలేదు. మంగళవారం రాత్రి గాజా నగరంలో ఆ దేశ బలగాలు జరిపిన దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో ఇప్పటిదాకా 44 వేలమందికిపైగా మరణించారు. లక్షల మంది గాయపడ్డారు.


కాల్పుల విరమణ ఒప్పందం ఎన్నాళ్లు అమల్లో ఉంటుందనేది హెజ్‌బొల్లాపైనే ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. ఒప్పందాన్ని హెజ్‌బొల్లా/లెబనాన్‌ ఉల్లంఘిస్తే తాము తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ సైనికుల సంక్షేమంతోపాటు హమాస్‌ను ఒంటరిని చేయాలనే ఉద్దేశంతో తాజా ఒప్పందానికి తాము అంగీకరించినట్లు చెప్పారు. మరోవైపు- ఇరాన్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్న వ్యూహంలో భాగంగానే హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ కుదుర్చుకున్నట్లు  విశ్లేషణలు తెలుపుతున్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter