ప్రాణాంతక కరోనా వైరస్ (Coronavirus) మరణాలు చైనాలో మొదలుకాగా,  ఇటలీలో మాత్రం పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. ఇటలీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. తొలిరోజుల్లో నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో కోవిడ్19 ఇటలీలో వేలాది ప్రాణాల్ని తీసుకుంటుంది. శనివారం ఒక్కరోజే ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి 793 మంది మృత్యువాతపడ్డారు. ప్రాణాంతక కరోనా వైరస్ వెలుగుచూశాక.. ఓ దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా శనివారం ఇటలీలో చనిపోవడం విచారకరం. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 4825కు చేరుకుంది.


కరోనాపై గర్భవతులకు శుభవార్త.. ఆ ఆందోళన అక్కర్లేదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6,557 మంది కొత్తగా కోవిడ్19 వైరస్‌ బారిన పడ్డారు. గత పది రోజులుగా దేశం పూర్తిగా నిర్బంధంలో ఉన్పప్పటికీ మరణాలు మాత్రం తగ్గకపోవడం అధికారులను, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మిలన్‌ నగరం సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతానికి చెందినవారే 3000 మందిని ప్రాణాంతక కరోనా వైరస్ బలితీసుకుంది. కాగా, గత రెండు రోజుల్లోనే 1400 మంది కరోనా బారిన పడి చనిపోవడం ఇటలీలో వైరస్ తీవ్రను స్పష్టం చేస్తోంది.  కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!


జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!


నియంత్రణ చర్యలు త్వరగా తీసుకున్న చైనా కరోనా నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటుంటే.. ఆ తర్వాత కరోనా సోకిన ఇటలీ మాత్రం తేరుకోలేక ఆపసోపాలు పడుతోంది. భారత్‌లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూను తీసుకొచ్చారు. మార్చి 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos