దేశంలో భద్రతా పరమైన విషయం మినహాయిస్తే ఓ కర్ఫ్యూ అమలు చేయడం చాలా ఆసక్తికరమైన అంశం. నేటి (మార్చి 22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు భారత్‌లో జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్‌ను నశింపచేసేందుకు ఇదొక మార్గంగా కనిపిస్తుంది. అయితే ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ తెలంగాణలో 24గంటలపాటు అమలుచేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు. ఆదివారం ఉదయం అమలులోకి వచ్చిన ఈ కర్ఫ్యూ సోమవారం ఉదయం 6గంటల వరకు అమలులో ఉండనుంది. దీనివల్ల కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందేనని వైద్య నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Read also : Coronavirus: రైళ్లలో ప్రయాణించిన వారికి కరోనావైరస్.. ప్రయాణికులకు రైల్వే సూచన
కరోనా వైరస్ గరిష్టంగా 12 గంటల వరకు బతికి ఉండి దానంతట అదే మరణిస్తింది. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు సోకకుండా, అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తితో పాటు ఆ ప్రాణాంతక కోవిడ్19 వైరస్‌నే అంతం చేయాలన్నది జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం. బయటకు వెళ్తే ఇతరుల ద్వారా ప్రత్యక్షంగా, లేక వారు తాకిన వస్తువులను తాకడంతో పరోక్షంగానూ కరోనా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. 12గంటల పాటు బతికుండే కరోనా వైరస్‌ను నశింపజేసేందుకు మరో రెండు గంటలు కలుపకుని 14గంటల పాటు జనతా కర్ఫ్యూ విధించారు.
Read also : కరోనాపై గర్భవతులకు శుభవార్త.. ఆ ఆందోళన అక్కర్లేదు
పాటించాల్సిన, తెలుసుకోవాల్సి విషయాలివి...
- దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ అమలు నేపథ్యంలో ఆదివారం మార్చి 22, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు కచ్చితంగా ఇళ్లల్లోనే ఉండాలి.
- వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్త తీసుకున్న ఇలాంటి మహమ్మారి వైరస్‌లను ఎదుర్కోలేము. అందుకే జనతా కర్ఫ్యూలో అందరం పాల్గొని ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అదే సమయంలో 12 గంటల వ్యవధిలో వైరస్ దానంతట అదే నశిస్తుంది.
- తెలంగాణలో అయితే మార్చి 22న ఉదయం 6గంటల నుంచి సోమవారం (మార్చి 23) ఉదయం 6 గంటల వరకు జనతాకర్ఫ్యూ అమలులో ఉంటుంది. మన ఆరోగ్యం కోసం అందరూ కర్ఫ్యూను ఉల్లంఘించకూడదు.
- రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తయారుచేసుకుని తినడం మంచి పని. ముఖ్యంగా మీ పిల్లలు, వయసు పైబడిన వారిని ఇంటి నుంచి బటయకు వెళ్లకుండా చూసుకోండి.
- చేతుల్ని శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కుంటూ ఇంట్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అవకుండా చూసుకుందాం.
- సాయంత్రం 5 గంటలకు దేశ వ్యాప్తంగా ప్రజలు తమ బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టి వైద్య, సహాయక సిబ్బందికి.. కరోనాతో పోరాడి చనిపోయిన వారికి సంఘీభావం ప్రకటిద్దాం.
- ఇంట్లో ఉన్నాం కదా అని కుటుంబసభ్యులను తాకడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయవద్దు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..