Jeff Bezos Regains Worlds Richest Person: ప్రపంచ కుబేరుల రేసులో జెఫ్ బెజోస్ దూసుకెళ్తున్నాడు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను రెండో స్థానానికి పడిపోయాడు. ఆరు వారాల తరువాత అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ మళ్లీ తన అగ్రస్థానాన్ని చేరుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఎలాన్ మస్క్(Elon Musk)‌కు చెందిన టెస్లా కార్ల కంపెనీ షేర్ 2.4 శాతం పడిపోయింది. తద్వారా 4.9 బిలియన్ డాలర్ల మొత్తంలో ఎలాన్ మస్క్ కోల్పోవడంతో మరోసారి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. బ్లూమ్‌బర్గ్ బియనీర్స్ తాజా సూచీలో బెజోస్ నెంబర్ వన్ అయ్యాడు. 


Also Read: NHAI FAQs: ఒక వాహనం FASTagను వేరే వాహనానికి ఉపయోగించవచ్చా, కారు అమ్మితే ఏం చేయాలి


అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద విలువ 191.2 బిలియన్ డాలర్లతో మరోసారి ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు. అదే సమయంలో ఎలాన్ మస్క్ మొత్తం సంపద విలువ 185 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచిక వెల్లడించింది. ప్రస్తుతం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కన్నా బెజోస్(Jeff Bezos) సంపద 7.2 బిలియన్ డార్లు అధికంగా ఉందని సమాచారం.


Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి


ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్న ఎలాన్ మస్క్ ఇటీవల క్రిప్టో కరెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో బిట్‌కాయిన్ ఏకంగా 50 వేల డాలర్ల మార్కును చేరుకోవడం గమనార్హం. గత నెలలో అత్యధికంగా షేర్ల విలువ కలిగి ఉన్న టెస్లా కంపెనీ ఒక్కసారిగా ఈ నెలలో 10 శాతం మేర పతనం కావడంతో ఎలాన్ మస్క్ మరోసారి కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook