Jeff Bazos: అమెజాన్ సీఈఓ అరుదైన రికార్డు

ప్రపంచ కుబేరుడు.. అమెజాన్ ( Amazon ) సంస్థ సీఈఓ జెఫో బేజోస్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. 

Last Updated : Aug 27, 2020, 06:45 PM IST
    • ప్రపంచ కుబేరుడు.. అమెజాన్ ( Amazon ) సంస్థ సీఈఓ జెఫో బేజోస్ మరో రికార్డు క్రియేట్ చేశాడు.
    • ;ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బేజోస్ ( Jeff Bazos ) వద్ద ఉన్న డబ్బు ఎంతో తెలుసా?
Jeff Bazos: అమెజాన్ సీఈఓ అరుదైన రికార్డు

ప్రపంచ కుబేరుడు.. అమెజాన్ ( Amazon ) సంస్థ సీఈఓ జెఫో బేజోస్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బేజోస్ ( Jeff Bazos ) వద్ద ఉన్న డబ్బు ఎంతో తెలుసా 200 బిలియన్ డాలర్లు  అంటే 20 వేల కోట్ల డాలర్లు అన్నమాట. ఇంత డబ్బు ఇప్పటి వరకు ఏ వ్యక్తి వద్ద లేదు. ఈ మేరకు బేజోస్ 200 బిలియన్ డాలర్ల సంపద కూడగట్టిన తొలి వ్యక్తిగా అవతరించాడు.

 

గత కొంత సమయం నుంచి యూఎస్ ( USA ) స్టాక్ మార్కెట్ లో అమేజాన్ షేర్లూ దూకుడు చూపిస్తున్నాయి. దీంతో బెజోస్ సంపద అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం జెఫ్ మొత్తం సంపద విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉంది. బుధవారం మాత్రమే సుమారు 5.22 బిలియన్ డాలర్ల సంపద పోగు చేసుకున్నాడు. కరోనావైరస్ సమయంలో చాలా మంది తమ సంపదను కోల్పోగా జెఫ్ సంపద బాగా పెరిగింది.

 

Trending News