US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా సందిగ్దంలోనే ఉన్నాయి. విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్న డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్.. 3 వందల ఓట్లతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ( America President Elections ) ఫలితాలు ఇంకా సందిగ్దంలోనే ఉన్నాయి. విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్న డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్.. 3 వందల ఓట్లతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మూడ్రోజులుగా ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకపోవడంతో పీఠం ఎవరిదనే విషయంపై ఆసక్తి నెలకొంది. వైట్‌హౌస్ ( White house ) అధికారానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ ( Magic figure ) 270 కాగా...డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) అభ్యర్ధి జో బిడెన్ ( Joe Biden ) 264 ఓట్లు సాధించి..6 ఓట్ల దూరంలో నిలిచారు. అటు రిపబ్లికన్ పార్టీ ( Republican party ) అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఇంకా 5 రాష్ట్రాల కౌంటింగ్ జరుగుతోంది. జార్జియాలో ఇప్పటికే కౌంటింగ్ దాదాపుగా పూర్తయి వస్తోంది. జో బిడెన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ తరుణంలో జో బిడెన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. 3 వందల ఓట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గెలుపు ఇప్పటికే స్పష్టమైందని..మనం గెలవబోతున్నామని తెలుస్తోందన్నారు. ఐదు కీలక రాష్ట్రాల్లో..నాలుగింటిలో ముందంజలో ఉన్నామని...ఆరిజోనా, జార్జియాలో గెలిచిన తొలి డెమోక్రట్లు తామేనని చెప్పారు. బ్లూ వాల్‌ని దేశం నడిబొడ్డున రీ బిల్ట్ చేసినట్టు బిడెన్ ట్వీట్ చేశారు. 24 ఏళ్ల అరిజోనా చరిత్రలో...28 ఏళ్ల జార్జియా చరిత్రలో తొలిసారిగా డెమోక్రట్లు విజయం సాధించారని తెలిపారు.
అరిజోనా, జార్జియాతో పాటు నెవాడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా బిడెన్ ఆదిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 530 ఎలక్టోరల్ ఓట్ల ( Electoral Votes ) తో 270 ఓట్లు మ్యాజిక్ ఫిగర్. విజయంపై ధీమా వ్యక్తం చేసిన బిడెన్..అధికారంలో రాగానే..కరోనా వైరస్ ను నియంత్రిస్తానన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా అమెరికాలో 2 లక్షల 31 వేలమంది మరణించగా..9 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారు.
కౌంటింగ్ సరళిని పరిశీలించినా బిడెన్ ఆధిక్యమే కొనసాగుతున్నట్టు అర్దమౌతోంది. ముందు నుంచీ జో బిడెన్ తన ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ కంటే 50 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. Also read: Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు