అమెరికా అధ్యక్ష ఎన్నికల ( America president Elections ) ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నువ్వా నేనా రీతిలో కౌంటింగ్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ ( Magic figure for America Elections ) అంకెల్లో ప్రస్తుతానికి జో బైడెన్...డోనాల్డ్ ట్రంప్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కౌంటింగ్ ( Counting ) ఇంకా కొనసాగుతోంది. శ్వేతసౌధం ( White House ) పోటీకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 270 ( Magic figure 270 ) కాగా...డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్  224 ( Joe Biden got 224 Electoral Votes ) ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా...ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ 213 ( Donald Trump with 213 Votes ) ఓట్లతో కాస్త వెనుకంజలో ఉన్నారని యూఎస్ మీడియా వెల్లడించింది. కీలకమైన ఆరిజోనా, జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కోన్సిన్ వంటి రాష్ట్రాల ఫలితాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. అమెరికన్ ఓటర్లు రెండుగా చీలిపోయినట్టుగా ప్రస్తుత ఫలితాలు వెల్లడిస్తున్నాయి.


ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని జో బైడెన్ ( Joe Biden ) విశ్వాసం వ్యక్తం చేయగా..కీలకమైన పశ్చిమ మధ్య రాష్ట్రాలపైనే అందరి దృష్టీ నెలకొంది. బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలుగా భావిస్తున్న అరిజోనా, జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ల ఫలితాలు ఇంకా రావల్సి ఉన్న నేపధ్యంలో విజయం ఎవరిదనేది ఇంకా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ఫలితాల్ని తారుమారు చేసే పరిస్థితి ఈ రాష్ట్రాలకుంది.  Also read : 


డోనాల్డ్ ట్రంప్ కు లభించిన ఎలక్టోరల్ ఓట్ల వివరాలు


డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) కు అలబామా ( 9 ) అర్కాన్సాస్ (6), ఫ్లోరిడా (29), ఇదాహో (4) ఇండియానా (11), లోవా (6), కాన్సాస్ (6), కెంటకీ (8), లూసియానా (8), మిస్సిసిపీ (6), మిస్సోరి (10), మోంటానా (3), నెబ్రాస్కా (4), నార్త్ డకోటా (3), ఒహియో (18),  ఓక్లహోమా (7), సౌత్ కరోలినా (9), సౌత్ డకోటా (3), టెన్నెస్సీ (11), టెక్సాస్ (38), ఉటాహ్ (6),  వెస్ట్ వర్జీనియా (5), వయోమింగ్ (3) రాాష్ట్రాల్నించి 213 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.


జో బైడెన్ కు లభించిన ఎలక్టోరల్ ఓట్ల వివరాలు


ఇక డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ కు కాలిఫోర్నియా (55), కొలరాడో (9), కనెక్టికట్ (7), డెలావేర్ (3), కొలంబియా జిల్లా (3), హవాయ్ (4), ఇల్లినాయిస్ (20), మేరీల్యాండ్ (10), మసాచుసెట్స్ (11), మిన్నెసోటా (10), నెబ్రాస్కా (1), న్యూ హ్యాంప్ షైర్ (4), న్యూ జెర్సీ (14), న్యూ మెక్సికో (5), న్యూయార్క్ (29), ఓరెగాన్ (7), రోడ్ ఐలాండ్ (4), వెర్మౌంట్ (3), వర్జీనియా (13), వాషింగ్టన్ (12) రాష్ట్రాల్నించి 224 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.


అలాస్కా, ఆరిజోనా, జార్జియా, మైనే, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కోన్సిన్ రాష్ట్రాల ఫలితాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. Also read: America Elections: సర్వే ఫలితాలు బైడెన్ వైపు..బెట్టింగ్ మార్కెట్ ట్రంప్ వైపు