America Elections: సర్వే ఫలితాలు బైడెన్ వైపు..బెట్టింగ్ మార్కెట్ ట్రంప్ వైపు

  ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. డోనాల్డ్ ట్రంప్-జో బైడెన్ పోటీ హోరాహోరీగా సాగుతుంటే..బెట్టింగు మార్కెట్లు మాత్రం ట్రంప్ నే ఫేవరెట్ గా చెబుతున్నాయి.

Last Updated : Nov 4, 2020, 12:55 PM IST
America Elections: సర్వే ఫలితాలు బైడెన్ వైపు..బెట్టింగ్ మార్కెట్ ట్రంప్ వైపు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల ( America Elections ) పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. డోనాల్డ్ ట్రంప్-జో బైడెన్ పోటీ హోరాహోరీగా సాగుతుంటే..బెట్టింగు మార్కెట్లు మాత్రం ట్రంప్ నే ఫేవరెట్ గా చెబుతున్నాయి.

ప్రతిష్ఠాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ( America president Elections ) రసవత్తరమైన పర్వం నడుస్తోందిప్పుడు. ఓట్ల లెక్కింపు ( Counting ) ప్రారంభమైంది. పోటీ నువ్వా నేనా రీతిలో ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అత్యధిక సర్వేలు బైడెన్ వైపు మొగ్గుచూపాయి. డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) కంటే జో బైడెన్ కే విజయావకాశాలున్నాయని స్పష్టం చేశాయి. ప్రీపోల్ సర్వే ఫలితాలు ఇలా ఉంటే..బెట్టింగ్ మార్కెట్ మాత్రం డోనాల్డ్ ట్రంప్ నే ఫేవరైట్ అంటోంది. ఎవరికి అధికారం దక్కుతుందో..ఎవరింటికి వెళ్తారనేది మరి కాస్సేపట్లో తేలనుంది. 

బెట్టింగ్ మార్కెట్ లో ( Betting market in faour of Trump ) అత్యధి శాతం డోనాల్ట్ ట్రంప్ నే ఫేవరైట్ గా వస్తోంది. ట్రంప్ విజయానికి అనుకూలంగానే పందేలు జోరందుకున్నాయి. డోనాల్ట్ ట్రంప్..జో బైడెన్ ( Joe Biden ) కంటే ముందంజలో ఉన్నారని న్యూజిలాండ్ కు చెందిన ప్రెడిక్షన్ మార్కెట్ అంచనా వేస్తోంది. అయితే కాస్సేపటికే ఈ సంస్థ వెబ్ సైట్ నిలిచిపోయింది. కారణాలు స్పష్టం కాలేదు. అటు బ్రిటీష్ బెట్టింగ్ ఎక్స్చేంజ్ బెట్ ఫెయిర్ సైతం ట్రంప్ కే గెలిచే అవకాశాలు 75 శాతం ఉన్నాయంటోంది.  ఎన్నికలు ప్రారంభమైనప్పుడు 39 శాతం అవకాశాలున్నాయని చెప్పిన ఈ సంస్థ..ఆ తరువాత 75 శాతమని స్పష్టం చేసింది. ఇక బైడెన్‌ కు ముందు..61 శాతం విజయావకాశాలున్నాయని చెప్పగా..అనంతరం అది 25 శాతానికి పడిపోయింది. Also read: Covid19 vaccine: కరోనా వైరస్ కు మరో వ్యాక్సిన్ రెడీ

ఇక కౌంటింగ్ ఫలితాల్ని ఓసారి పరిశీలిస్తే ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం జో బైడెన్ వైట్ హౌస్ పోటీ ( White house fight ) లో డోనాల్డ్ ట్రంప్ కంటే  ఆధిక్యంలో ఉన్నారు. వైట్ హౌస్ పోటీలో అధ్యక్ష పదవి గెల్చుకోడానికి 270 ఓట్లు కావల్సి ఉండగా..ఇప్పటివరకూ బైడెన్ 2 వందలకు పైగా ఓట్లు దక్కించుకున్నారు. అటు ట్రంప్ 118 ఓట్లు సాధించారు. ట్రంప్.. బైడెన్‌ను గణనీయంగా అధిగమించి..ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడని కొంతమంది చెబుతున్నారు. బ్రిటన్ దేశపు మరో స్మార్కెట్స్ ఎక్స్ఛేంజ్ మాత్రం ట్రంప్‌ మరోసారి గెలవడానికి 55శాతం అవకాశం ఉందని తెలిపింది. 

క్యూబా జనాభా అధికంగా ఉన్న మియామి-డెడ్ కౌంటీలో డోనాల్డ్ ట్రంప్ చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ ఫ్లోరిడాలో ట్రంప్‌ విజయానికి ఇదే ప్రదాన కారణంగా ఉండనుంది. ఎందుకంటే మొదటి నుంచి ఫ్లోరిడా ట్రంప్‌కే అనుకూలంగా ఉంది. అతి ముఖ్యమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ తన అధిక్యాన్ని ప్రదర్శించగలిగితే మాత్రం విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు.  Also read: America Elections: ప్రీ పోల్స్ నిజం కానున్నాయా...లేదా గతంలో జరిగినట్టే పల్టీ కొడతాయా

Trending News