Joe Biden: ఈ విజయం దేశ ప్రజలందరిదీ..
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( America President Elections ) పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.
అమెరికా ( America ) అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నాదాదాపు స్పష్టత వచ్చేసింది. వైట్ హౌస్ ( White House ) అధికారానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) అభ్యర్ధి జో బిడెన్ ( Joe Biden ) ఇప్పటికే 264 ఓట్లు సాధించారు. అటు ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ( Republican party ) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) 214 ఎలక్టోరల్ ఓట్లు దగ్గరే దాదాపుగా ఆగిపోయినట్టు కన్పిస్తోంది. ఇంకా కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. Also read:US Elections: మ్యాజిక్ ఫిగర్ 270..224 ఓట్లతో బైడెన్ కు స్వల్ప ఆధిక్యం , ట్రంప్ కు 213
ఈ సందర్బంగా జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కచ్చితంగా ఘన విజయం సాధిస్తాననే విశ్వాసముందని..విజయం తానొక్కడిదే కాదని బిడెన్ అన్నారు. ఈ విజయం దేశప్రజలందరిదీనని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాల్ని డోనాల్డ్ ట్రంప్ గానీ, తాను గానీ నిర్ణయించలేమని..అమెరికా ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అందుకే బిడెన్ ఫైట్ ఫండ్ తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి ఓటు పరిగణలో తీసుకోవల్సి వస్తుందని..ఈ ప్రత్యేక ఫండ్ ను దేశవ్యాప్తంగా ఎన్నికల పరిరక్షణ చర్యల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.
అమెరికా అధ్యక్ష పీఠానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 270 ( Magic Figure ) కాగా..ఇప్పటికే 263 ఓట్లు దక్కించుకున్న బిడెన్ కు విజయం దాదాపుగా ఖరారైంది. మరో 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో వైట్ హౌస్ ఆయన కోసం నిరీక్షిస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ కు ఇప్పటివరకూ 6 కోట్ల 86 లక్షల ఓట్లు లభించగా..డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ కు 7 కోట్ల 20 లక్షల ఓట్లు దక్కాయి. బిడెన్ ఓటు షేరే 50.4 శాతం కాగా...ట్రంప్ ఓట్ షేర్ 48 శాతముంది.
కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు నువ్వా నేనా రీతిలో సాగుతున్నాయి. పూర్తి స్పష్టత రావడానికి మరింత సమయం పట్టనుంది. నెవాడాలో పోటీ హోరోహోరీగా సాగుతుంటే...ఆరిజోనాలో బిడెన్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. మిచిగాన్, న్యూ హ్యాంప్ షైర్ లలో బిడెన్ పూర్తి ఆధిక్యత సాధించారు. Also read: Barak Obama: మాజీ అధ్యక్షుడు ఒబామా రికార్డును బద్దలుకొట్టిన జో బిడెన్