Melania Trump to Divorce Donald Trump |ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ తో ( Joe Biden ) పోటీపడి ఓటమిపాలైన డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) త్వరలో మరిన్ని చిక్కుల్లో పడేలా ఉన్నాడు. ట్రంప్ తో కలిసి పని చేసిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రంప్ వైట్ హౌన్ నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో అని అతని సతీమణి మెలానియా ట్రంప్ తెగ ఎదురుచూస్తోందట. దీనికి కారణం ట్రంప్ ఇలా శ్వేత సౌధం ఖాళీ చేయగానే అలా విడాకులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ది డైలీ మేయిల్ యూకేలో ఈ మేరకు ఒక నివేదిక ప్రచురితం అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 


మెలానియా ట్రంప్ ( Melania Trump ) వద్ద సీనియర్ అడ్వైజర్ గా పని చేసిన స్టెఫ్నీ వోకాఫ్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. ట్రంప్ దంపతులు వేరు వేరు గదుల్లో ఉండేవారు అని తెలిపింది. విడాకులు కోసం మెలానియా ఎప్పుడెప్పుడా అని కాచుకు కూర్చుంది అని తెలిపింది స్టెఫ్నీ. వారి పెళ్లి అనేది ఒక లావాదేవీ మాత్రమే రహస్యాలు వెల్లడించింది.



Also Read | Thimmarusu: చట్టానికి న్యాయానికి... పాటపై బ్రహ్మాజి లిప్ సింక్...రవి బాబు రియాక్షన్


2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మెలానియా కంటతడి పెట్టిందట. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అతను గెలుస్తాడు అని అనుకోలేదు అని చెప్పిందట మెలానియా.
50 సంత్సరాల మెలానియా ట్రంప్ బయటికి వచ్చినప్పుడు, పబ్లిక్ లో ఉన్నప్పుడు 74 సంవత్సరాల ట్రంప్ తో తనకు మధ్య అంతా బాగున్నట్టు నటిస్తుంది అని తెలిపింది పీఏ. అధ్యక్షపదవి గౌరవం కోసమే ట్రంప్ తో మెలానియా కలిసి ఉంది అని.. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అందరూ వేచి చూస్తున్న విషయం.



Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR