6.3 Magnitude Earthquake hits Nepal, Strong Tremors In Delhi: పక్కదేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ భూవిజ్ఞాన కేంద్రం వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఐదు గంటల్లోనే నేపాల్‌లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం... నేపాల్‌లో మంగళవారం రాత్రి 8.52 గంటలకు 4.9 తీవ్రతతో మొదటిసారి భూకంపం నమోదైంది. రాత్రి 9.41 గంటలకు 3.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించింది. ఇక బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. 5 గంటల్లోనే మూడు భూకంపాలు రావడం అక్కడి ప్రజలను ఆందోళన కల్గిస్తోంది. వరుస భూకంపాలతో నేపాల్ ప్రజలు బిక్కుమంటున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. 



నేపాల్‌లో భారీ  భూకంపాల ధాటికి భారత రాజధాని ఢిల్లీలో భూమి ఒక్కసారిగా కంపించింది. బుధవారం ఉదయం 2 గంటల సమయంలో పలు చోట్ల భూప్రకంపన వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 1.6గా నమోదైంది. నొయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం తెలుస్తోంది. అలానే ఉత్తరప్రదేశ్,  మణిపూర్‌లోనూ పలు చోట్ల బలమైన ప్రకంపనలు వచ్చాయట. యూపీ మొరాదాబాద్‌లోని ఒక కార్యాలయంలో భూకంపం సంభవించిన
సీసీటీవీ ఫుటేజ్ ఒకటి లభ్యమైంది. 




Also Read: IND vs ENG: వర్షం కారణంగా భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?


Also Read: IND vs ENG: డేవిడ్ మలన్ ఔట్.. సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లండ్! టీమిండియాకు చుక్కలే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి