Twitter Accountes Hacked: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) , మైక్రోసాఫ్ట్ (Microsoft ) అధినేత బిల్ గేట్స్ ( Bill Gates ) వంటి అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ ( Twitter Account Hacked ) అయ్యాయి. ప్రపంచంలో ఈ స్థాయిలో హ్యాకింగ్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు టెక్ నిపుణులు. ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తున్న ఈ హ్యాకింగ్‌కు బిట్‌కాయిన్ స్కామ్‌తో ( Bitcoin Scam ) సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ ( Elon Musk ) , జెఫ్ బీజోస్ ( Jeff Bezos ), బిల్ గేట్స్ ( Bill Gates Twitter Hacked ) లాంటి బిలియనీర్ల ఖాతాలతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జోసెఫ్ బెడెన్, కేయిన్ వెస్ట్ ( Kayne West ) వంటి ప్రముఖుల ట్విట్టర్ ఎకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి. Corosure: అత్యంత చవకైన కరోనా టెస్ట్ కిట్‌ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిలయనీర్లు, పొలిటీషియన్స్‌కు క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వమని  ట్వీట్స్ వస్తుంటాయి. వాటికి స్పందించిన వారి ఖాతాలు ఇలా హ్యాక్ అయ్యాయి అని తెలుస్తోంది.  మైక్రసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ట్విట్టర్ ఎకౌంట్ కూడా ఇలాగే హ్యక్ అయింది అని తెలుస్తోంది. హ్యాక్ అయిన తరువాత హ్యాకర్లు ( Hackers ) తమ సందేశాన్ని డైరక్ట్‌గా వారి ఖాతాలో పోస్ట్ చేశారు. మీరు నాకు వెయ్యి డాలర్లు పంపిస్తే నేను మీకు రెండు వేల డాలర్లు పంపిస్తాను అని పోస్ట్ చేశారు హ్యాకర్లు. దీంతో చాలా మంది డబ్బు పంపించారు. 



హ్యాకింగ్‌కు సంబంధించి ట్విట్టర్ కూడా ఒక ప్రకటన చేసింది. దీనిపై ఆ సంస్థ సీఈవో జాక్ డోర్సీ ( Jack Dorsey ) స్పందిస్తూ.. ఇది చాలా గడ్డు రోజు అని దీనిపై దర్యాప్తు చేస్తున్నాం అని ప్రకటించారు.




ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాకింగ్ గురించి తెలియగానే.. ప్రభావితం అయిన ఖాతాలను వెంటనే లాక్ చైసినట్టు.. వీటి గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని ట్విట్టర్ తెలిపింది  తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స, ఫ్రీగా కోవిడ్ టెస్టులు