Omicron Effect: కోవిడ్  మహమ్మారి పీక్స్‌కు చేరుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒమిక్రాన్ నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తోందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక ఆందోళన రేపుతోంది. కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నా..అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని..లేకపోతే రానున్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అందుకే కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. 


అత్యంత వేగంగా సంక్రమిస్తున్న వైరస్‌లలో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ (Delta Variant) కూడా ఉందని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిదో..నిర్లక్ష్యం వహిస్తే అంత తీవ్రంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌తో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో బెడ్స్ లభించని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారు తక్షణం తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వైద్య నిపుణులు తెలిపారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) విషయంలో ప్రస్తుతానికి తక్కువగా ఉన్నా..ఆ తరువాత బలంగా మారి ప్రమాదం ఏర్పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. గతంలో డెల్టా వేరియంట్ విషయంలో కూడా ఇదే జరిగిందని ఉదహరించారు. 


Also read: Omicron: గతంలో కరోనా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook