Pakistan: పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటీవ్
పాకిస్తాన్‌లో నాయకులు, ప్రముఖులందరినీ కరోనావైరస్ (coronavirus) భయం వెంటాడుతోంది. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని దాదాపు 10మందికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. అంతకుముందు కూడా పలువురు కోవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రికి కూడా కరోనా సోకడంతో అక్కడి నాయకుల్లో, ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది.
Pakistan foreign minister: ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో (Pakistan) నాయకులు, ప్రముఖులు అందరినీ కరోనావైరస్ (coronavirus) భయం వెంటాడుతోంది. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని దాదాపు 10 మందికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. అంతకుముందు కూడా పలువరు కోవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రికి కూడా కరోనా సంక్రమించింది. Also read: PM Modi meets soldiers: జవాన్ల ధైర్య సాహసాలను మెచ్చుకున్న ప్రధాని మోదీ..
పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ నాయకుడు, విదేశాంగశాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషి (Shah Mahmood Qureshi) కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు షా శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేసి వెల్లడించారు. ‘‘ఈ రోజు మధ్యాహ్నం స్వల్ప జ్వరం వచ్చింది. వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాను. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటీవ్‌గా వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యవంతంగా, బలంగానే ఉన్నాను. ఇంటినుంచే నా విధులను కొనసాగిస్తాను. దయచేసి నా కోసం ప్రార్థించండి’’ అంటూ ట్వీట్‌లో రాశారు. Also read: PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా
పాక్‌లో 2,21,000 దాటిన కరోనా కేసులు..
ఇదిలాఉంటే.. పాకిస్తాన్‌లో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 2,21,000 దాటింది. 4,500 మందికి పైగా మరణించారు. ఇప్పటివరకు దాదాపు 1,13,623 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..