నిన్న నేపాల్ ( Nepal ).. నేడు పాకిస్తాన్ ( Pakistan ). భారత భూభాగాల్ని తమవిగా చూపించుకుంటూ మ్యాప్ విడుదల చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. పాకిస్తాన్ రూపొందించిన కొత్త రాజకీయ మ్యాప్ కు పాకిస్తాన్ కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎన్ని చేసినా..ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా..ఎంతగా దివాళా పరిస్థితులు తలెత్తినా పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారనే మారదు. దుర్నీతిని ప్రదర్శిస్తూనే ఉంటోంది. ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన రాజకీయ మ్యాప్ తో మరోసారి కుటిలబుద్ధిని బయటపెట్టుకుంది. జమ్ము ( jammu ), కశ్మీర్ ( Kashmir ), లడఖ్ ( Laddakh ) ప్రాంతాల్ని భూభాగాలుగా పేర్కొంటూ పాకిస్తాన్ సరికొత్త మ్యాప్ ( pakistan new map ) ను రూపొందించడమే కాకుండా...పాక్ కేబినెట్ ( Pak cabinet ) తో ఆమోదముద్ర కూడా వేయించుకుంది. ఆర్టికల్ 370 ( Article 370 ) రద్దయి ఏడాది అవుతున్న నేపధ్యంలో పాకిస్తాన్ ఈ మ్యాప్ విడుదల చేయడం గమనార్హం. ఈ కొత్త మ్యాప్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. అంతేకాకుండా ఈ మ్యాప్ పాకిస్తాన్, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందని...పాక్ చరిత్రలో సరికొత్త అద్యాయానికి ఇది నాంది అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. Also read: USA: అంతమంది చనిపోతారా ? అసలేం జరుగుతోంది ?


ఇప్పటివరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ( Pak Occupied Kashmir ) లో అన్ని ప్రాంతాల్ని అధికారికంగా తమవిగా పాకిస్తాన్ చెప్పడం లేదు. గిల్గిట్ బాలిస్తాన్ ను తమ భూభాగంగానూ, మిగిలిన ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ గానూ పాక్ వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడిలా రాజకీయ మ్యాప్ ను విడుదల చేసి వివాదానికి తెర తీసింది. Also read: Mig 23: ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి సిద్ధం