Pfizer vaccine in UK: భారత సంతతి వ్యక్తికే తొలి కరోనా వ్యాక్సిన్
Pfizer vaccine in UK News Updates: ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను యూకేలో తీసుకోనున్న మొదటి వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా నిలవనున్నారు. నేటి నుంచి యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నారు.
Pfizer vaccine in UK: ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను యూకేలో తీసుకోనున్న మొదటి వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా నిలవనున్నారు. మంగళవారం (డిసెంబర్ 8న) యూకేలోని ఒక ఆసుపత్రిలో శుక్లాకు టీకా ఇవ్వనున్నారు. యూకేలో కరోనా వ్యాక్సిన్ అందుకోనున్న తొలి వ్యక్తిగా నిలవడంపై హరి శుక్లా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు, వ్యాక్సిన్ తీసుకునే అవకాశం లభించిందని తెలిసి చాలా సంతోషించానని’ హరి శుక్లా చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
‘కరోనా మహమ్మారిని అంతం చేయడంలో నేను భాగస్వామిని కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. నా వంతుగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఇది మామూలు మహమ్మారి కాదు. ఫైజర్ వ్యాక్సిన్ (Pfizer vaccine) తీసుకునేందుకు నేను ఏ విధమైన ఒత్తిడికి లోనుకావడం లేదు. మరియు దీని ఫలితాలు తెలిపేందుకు నేను చేయగలిగినదంతా చేస్తానని’ పీటీఐతో మాట్లాడుతూ హరి శుక్లా చెప్పారు.
Also Read : Bharat Biotech: కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు
ఫైజర్ వ్యాక్సిన్‌ను 80 ఏళ్లు లేక అంతకంటే పైబడిన వయసు వారికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు తొలుత వ్యాక్సిన్ అందించనున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా మంగళవారం నాడు వ్యాక్సినేషన్ ప్రారంభించనుంది. నేడు ప్రారంభం కానున్న ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ తొలి వారంలోనే సుమారు 800,000 మందికి అందనుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Photos: Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ
ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీపై యూకే పీఎం బోరిస్ జాన్సన్ మాట్లాడారు. కరోనా వైరస్‌పై యూకే చేస్తున్న పోరాటంలో ఈరోజు కీలక అడుగు పడనుంది. ఓ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించినా ప్రజలు తగిన జాగ్రత్తలు, కోవిడ్-19 పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.
Also Read : CoronaVirus Vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం తొక్కిసలాట జరగొచ్చు: WHO వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe