Bharat Biotech: కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు

ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (COVAXIN) తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ ఇటీవల దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) కి దరఖాస్తు చేసింది.

Last Updated : Dec 8, 2020, 10:36 AM IST
Bharat Biotech: కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు

Bharat Biotech applies for COVAXIN emergency use: న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ( Bharat Biotech ) అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (COVAXIN) తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ ఇటీవల దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DGCI ) కి దరఖాస్తు చేసింది. కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ సోమవారం దరఖాస్తు చేసినట్లు డీజీసీఐ అధికారులు వెల్లడించారు.

అయితే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR‌) సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ నవంబరు 16న దేశ్యావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి, రెండో దశల్లో కోవ్యాక్సిన్ టీకా మెరుగైన ఫలితాలు చూపించడంతో డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మూడో విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. అయితే తుది దశ ట్రయల్స్‌ విజయవంతమైతే వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. Also read: Anil Vij: కోవ్యాక్సిన్ తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్

ఇదిలాఉంటే.. భారత్ బయోటెక్ కంటే ముందు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కోవిడ్ టీకాల అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేశాయని అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తులను బుధవారం పరిశీలించనున్నట్లు సమాచారం.

Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News